Sam Pitroda: పిట్రోడా 'చైనా' వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ
ABN , Publish Date - Feb 17 , 2025 | 06:38 PM
శామ్ పిట్రోడా వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని, ఆయన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు.

న్యూఢిల్లీ: చైనాతో మనదేశం మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందని, చైనాను శత్రువులా చూడటం భారత్ మానుకోవాలని శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో కాంగ్రెస్ (Congress) పార్టీ వివరణ ఇచ్చింది. పిట్రోడా వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని, ఆయన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) వివరణ ఇచ్చారు.
Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
''చైనాపై శామ్ పిట్రోడా అభిప్రాయాలు భారత జాతీయ కాంగ్రెస్ అభిప్రాయం ఎంత మాత్రం కాదు. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థికపరంగా చైనా ఇప్పటికీ సవాలుగానే ఉంది'' అని జైరాం రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. చైనాపై భారత్ వైఖరిని కాంగ్రెస్ పదేపదే ప్రశ్నిస్తూనే ఉందని, 2020 జూన్ 19న చైనాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'క్లీ్న్ చిట్' ఇవ్వడాన్ని కూడా ప్రశ్నించిందని అయన తెలిపారు. చివరిగా 2025 జనవరి 28న కూడా చైనాపై కాంగ్రెస్ ఒక ప్రకటన చేసిందన్నారు. మనకెదురవుతున్న సవాళ్లపై చర్చించి, సమష్టిగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇటీవల పార్లమెంటు తోసిపుచ్చడం విచారకరమని అన్నారు.
శామ్ పిట్రోడా ఓ ప్రముఖ వార్తసంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, చైనాతో భారత్‌కు వచ్చే ముప్పు ఏమిటో తనకు అర్థం కావడం లేదని, చైనాను భారత్ మొదట్నించీ శత్రువుగానే చూస్తోందని, ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తోందని అన్నారు. ఈ విధానంతో దేశానికి కొత్త శత్రువులు పుడుతున్నారని, భారత్‌కు సరైన మద్దతు దొరకడం లేదని అన్నారు. భారత్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. చైనా పట్ల కాంగ్రెస్ అతిమోహానికి 2008లో చైనా కమ్యూనిస్టు పార్టీతో కుదుర్చుకున్న అవగాహనే (MOU) కారణమని విమర్శించింది. 40,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ డ్రాగెన్ నుంచి ముప్పును గుర్తించడం లేదని ఆక్షేపణ తెలిపింది. రాహుల్ గాంధీ సలహాదారు శామ్ పిట్రోడా అని, చైనా పీపుల్స్ లిబరేషన్ పార్టీతో రాహల్ గాంధీ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని, యూఎన్ఎస్‌సీలో భారత్ సభ్యత్వాన్ని చైనాకు జవహర్‌లాల్ నెహ్రూ కట్టబెట్టారని, కాంగ్రెస్‌కు, చైనాకు మధ్య మైత్రీబంధం చాలా పాతదని చురకలు వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Atishi: సీఎం ప్రకటనలో జాప్యం వెనుక కారణమదే..
Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.