CT Ravi: సువర్ణసౌధ ఘటనపై సీటీ రవి ఆగ్రహం
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:23 PM
బెళగావి సువర్ణసౌధలో మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar) అనుచరులు గుండాల తరహాలో ప్రవర్తించి దాడికి పాల్పడిన విషయమై బెళగావి పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi) తీవ్రంగా మండిపడుతున్నారు.
- జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు...?
- బెళగావి పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
బెంగళూరు: బెళగావి సువర్ణసౌధలో మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar) అనుచరులు గుండాల తరహాలో ప్రవర్తించి దాడికి పాల్పడిన విషయమై బెళగావి పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi) తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెందిన వారికి ఓ చట్టం ఇతరులకు మరో చట్టం అనేలా మారిందని ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ వార్తను కూడా చదవండి: Murder: దోసకాయ విషయంలో గొడవ.. చెల్లెలిని హత్యచేసిన అన్న
సువర్ణసౌధలోనే దాడి జరుగడంతో పాటు ఆవెంటనే పోలీసులకు దాడికి సంబంధించి ఫిర్యాదు చేసి 15 రోజులైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో జాతీయ మానవహక్కుల కమిషన్‌కు వెళ్ళేందుకు సీటీ రవి సిద్దమైనట్లు తెలుస్తోంది. అందుకు వ్యూహాత్మకంగానే ఇటీవల గవర్నర్‌తో పాటు డీజీపీలను కలిసి బెళగావి పోలీసుల(Belagavi Police) తీరు, మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, డీసీఎం డీకే శివకుమార్‌ల ప్రోత్సాహంపైనా వినతి పత్రం ఇచ్చారు.
జాతీయ మానవహక్కుల కమీషన్‌కు వెళ్ళేందుకు ముందుగా న్యాయనిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ విధానపరిషత్, సువర్ణసౌధలలో జరిగిన వివాదం సభాపతి, బెళగావి పోలీసుల పరిధిలోనే ఉండా జాతీయ మానవహక్కుల కమీషన్ దాకా వెళితే మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందనిపిస్తోంది. మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar) ఫిర్యాదును గంటలోపుగానే కేసు నమోదు చేసిన పోలీసులు ఏకపక్షంపై జాతీయ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళదలచినట్లు సమాచారం.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News