Share News

Delhi Assembly Elections: ఎన్నికల ప్రచార సాంగ్‌ను విడుదల చేసిన ఆప్

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:28 PM

కేజ్రీవాల్‌ను మరోసారి అదికారంలోకి తీసుకురావాలంటూ ఎన్నికల ప్రచార గీతాన్ని తాజాగా ఆ పార్టీ విడుదల చేసింది. ''ఫిర్ లాయేంగే కేజ్రీవాల్" అనే టైటిల్‌, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్‌ ఉంది.

Delhi Assembly Elections: ఎన్నికల ప్రచార సాంగ్‌ను విడుదల చేసిన ఆప్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2025 షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మంగళవారంనాడు ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. అన్ని పార్టీల కంటే ముందుగానే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) ప్రచారం పరంగానూ ఒకడుగు ముందులో ఉంది. కేజ్రీవాల్‌ను మరోసారి అదికారంలోకి తీసుకురావాలంటూ ఎన్నికల ప్రచార గీతాన్ని తాజాగా ఆ పార్టీ విడుదల చేసింది. ''ఫిర్ లాయేంగే కేజ్రీవాల్" అనే టైటిల్‌, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్‌ ఉంది.

Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ


'ఆప్' ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలును హైలైట్ చేస్తూ ఈ సాంగ్ రూపొందింది. ముఖ్యమంత్రి అతిషి, పార్టీ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, సంజయ్ సింగ్ తదిరులు ప్రచార సాంగ్ విడుదల కార్యక్రమంలో హాజరయ్యారు. ఢిల్లీ ప్రజల కోసం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రచారగీతంలో ఆప్ నేతలు వివరించారు. తమ పార్టీ గీతాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రజలను కోరారు.


గెలుపు మాదే: కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఎన్నికల్లో ఆప్ గెలుపు తథ్యమని చెప్పారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి. ''ఢిల్లీ ఎన్నికల తేదీ వచ్చేసింది. కార్యకర్తలంతా రెట్టించిన ఉత్సాహం, పూర్తి సామర్థ్యంలో రంగంలోకి దిగండి. కార్యకర్తలే పార్టీకి అతిపెద్ద బలం. పని చేసి ఓట్లడిగే రాజకీయాలకు, కేవలం విమర్శలతో ఓట్లడిగే రాజకీయాలకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ ఎన్నికలు. పనిచేసి ఓట్లడిగే రాజకీయాలపై ఆప్‌కు విశ్వాసం ఉంది. మనం తప్పనిసరిగా గెలుస్తాం'' అని కేజ్రీవాల్ ఒక ట్వీట్‌లో కార్యకర్తలను ఉత్సాహపరిచారు.


Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!

Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం

Read Latest National News and Telugu News

Updated Date - Jan 07 , 2025 | 04:28 PM