Delhi High Court: ‘కాగ్ నివేదిక’పై కావాలనే ఆలస్యం
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:11 AM
కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఢిల్లీ సర్కారుపై హైకోర్టు అసహనం
న్యూఢిల్లీ, జనవరి 13: కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ ఆలస్యం పలు అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ మద్యం విధానం వల్ల సర్కారుకు రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్న కాగ్ నివేదికపై చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సెషన్ ఏర్పాటుకు ఆదేశించాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.