Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:35 AM
Judge Corruption: ఆయనో హైకోర్టు జడ్జి. ఆ న్యాయమూర్తి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారు. అంతా బాగానే ఉన్నా.. మంటార్పాక ఆ ఇంట్లో కనిపించిన దృశ్యాలను చూసి ఫైర్ సిబ్బంది షాక్ అయ్యారు.

న్యూఢిల్లీ, మార్చి 21: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి (Delhi High Court judge) ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు న్యాయమూర్తి ఇంటి వద్దకు వెళ్లారు. అయితే మంటాలర్పే సమయంలో ఫైర్ సిబ్బంది ఆ ఇంట్లో కనించిన దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యారు. విషయం తెలిసిన సుప్రీం చీఫ్ జస్టిస్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో అగ్నిమాపక సిబ్బంది ఏం చూశారు.. సుప్రీం చీఫ్ జస్టిస్ ఎందుకు ఫైర్ అయ్యారో ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Delhi High Court Judge Justice Yashwant Verma) బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి ఆ ఇంట్లో భారీ ఎత్తున డబ్బులు లభ్యమవడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరని తెలుస్తోంది. ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించినట్లు తెలుస్తోంది. అగ్నికీలలను ఆర్పేశాక.. అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే డబ్బును స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. పట్టుబడిన నగదు మొత్తం లెక్కల్లో చూపని నగదుగా ఐటీ అధికారులు గుర్తించారు.
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో విడుదల..
సీజేఐ సీరియస్
మరోవైపు ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ప్రత్యక్షమవడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ కన్నా (Supreme Court Justice Sanjeev Khanna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం అత్యవసరంగా సమావేశమై యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అయితే న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తే సరిపోదని.. ఆయన రాజీనామా చేయాలని కొందరు కొలీజియం సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. ఓ న్యాయమూర్తి అయ్యిండి ఆయన ఇంట్లో ఇంతలా నోట్ల కట్టలు లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది. ఇంత డబ్బును న్యాయమూర్తి ఎలా సంపాదించాడనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
చర్యలు ఎలా ఉంటాయి...
అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఎన్ వర్మ కుమారుడు అయిన జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఢిల్లీ హైకోర్టు కొలీజియంలో సీనియర్ సభ్యులు. 2014లో ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు వర్మ. కాగా.. ఓ న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు వస్తే ముందు ఆయన నుంచి వివరణ తీసుకోవడం జరుగుతుంది. ఆపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో న్యాయమూర్తి దోషిగా తేలితే.. ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
Train: రైలులో ప్రయాణికుల ఆభరణాలు చోరీ
10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Read Latest National News And Telugu News