Share News

Maha Kumbh Mela 2025: మాఘపూర్ణిమ సందర్భంగా కుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం.. 6 గంటల నాటికి 73.60 లక్షల మంది

ABN , Publish Date - Feb 12 , 2025 | 10:28 AM

మహా కుంభమేళా 2025లో మాఘపూర్ణిమ రోజు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 4 నుంచే సీఎం వార్ రూమ్ నుంచి ఆయా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Maha Kumbh Mela 2025: మాఘపూర్ణిమ సందర్భంగా కుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం.. 6 గంటల నాటికి 73.60 లక్షల మంది
Maha Kumbh Mela 2025

మహా కుంభమేళా (maha kumbh mela 2025)కు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈరోజు మాఘపూర్ణిమ సందర్భంగా మాములు రోజుల కంటే పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నాటికే 73.60 లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈరోజు త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారు, వారి జీవితంలోని కష్టాల నుంచి విముక్తి పొందుతారని పండితులు భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకునే క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య కూడా ఏర్పడుతోంది.


సీఎం పర్యవేక్షణ

మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతోంది. దీంతో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు 15 జిల్లాల DMలు, 20 మంది IASలు, 85 మంది PCS అధికారులను విధుల్లో మోహరించారు. అలాగే, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉదయం 4 గంటల తర్వాత వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు డీజీ ప్రశాంత్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులకు సౌకర్యాలు అందించేందుకు అన్ని సన్నాహాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు భోజనాలు, పర్యాటక సౌకర్యాలు అందించడం సహా వారి ఆధ్యాత్మిక ప్రయాణం సాఫీగా సాగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.


స్నానం ప్రాముఖ్యత

మత విశ్వాసం ప్రకారం ఈరోజు దేవతలు భూమిపై వస్తూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని, తద్వారా భక్తులు శాంతిని, మోక్షాన్ని పొందగలుగుతారని ఇంకొంత మంది పండితులు అంటున్నారు. అందుకే మహాకుంభమేళాలో ఈ రోజు స్నానం అత్యంత పవిత్రమైన రాజస్నానంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. 2025 ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 నుంచి ఫిబ్రవరి 12 సాయంత్రం 7:22 వరకు మాఘపూర్ణిమ స్నాన సమయం కొనసాగుతుంది.

ఈరోజు ఉదయం స్నానం చేయడానికి శుభ సమయం 05:19 నుంచి 06:10 గంటల వరకు ఉంది. ఈ సమయాన్ని అనుసరించి భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి వారి సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు భావిస్తున్నారు. ఇప్పటికే మహా కుంభమేళాకు 40 కోట్ల మందికిపైగా వచ్చారు. ఈ క్రమంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 26, 2025 వరకు కొనసాగనున్న ఈ మేళాకు మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

Court: భార్యతో ఇష్టం లేకుండా అసహజ శృంగారం నేరం కాదు.. కోర్టు సంచలన తీర్పు


Narendra Modi: ఇన్వెస్ట్ మెంట్స్ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయమని వెల్లడి


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..

Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 12 , 2025 | 10:37 AM