Share News

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..

ABN , Publish Date - Feb 26 , 2025 | 03:02 PM

2025 మహా కుంభమేళా ఈరోజు చివరి దశకు వచ్చేసింది. నేడు మహాశివరాత్రి అయిన నేపథ్యంలో శివుడికి ప్రత్యేక పూజలు చేసేందుకు కాశీ విశ్వనాథ ఆలయం వైపు నాగ సాధువులు భారీగా తరలి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది. అయితే తర్వాత కుంభమేళా ఎక్కడ జరుగుతుందనే విషయాలను కూడా ఇప్పుడు చూద్దాం.

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..
Maha Kumbh Mela 2025

మహా కుంభమేళా 2025 (Maha Kumbh Mela 2025) ఈరోజు (ఫిబ్రవరి 26) చివరి రోజు అయిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 45 రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకకు ఇప్పటివరకు 65 కోట్లమందికిపైగా భక్తులు హాజరయ్యారు. చివరి రోజు మహాశివరాత్రి సందర్భంగా నాగ సాధువులు కాశీ విశ్వనాథ ఆలయం వైపు వెళ్లి శివుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలను డ్రోన్ విజువల్స్ ద్వారా షూట్ చేశారు. ఈ వీడియోలో ఒకేసారి అనేక మంది సాధువులు ఒక్కసారిగా వెళ్లిన దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు.


నాగ సాధువుల ప్రత్యేక పూజలు..

నాగ సాధువులు కుంభమేళా ముగిసిన తర్వాత, తమ ఆధ్యాత్మిక సాధన కొనసాగించడానికి మళ్లీ హిమాలయాలకు తిరిగి వెళతారు. నాగ సాధువులను సాధారణంగా హిందూ సన్యాసులుగా పరిగణించబడతారు. వీరు సాధారణ జీవనం వదిలేసి ఆధ్యాత్మికతను పాటిస్తూ కఠినమైన ధ్యానం, యోగా, ప్రార్థనలను చేస్తారు. అయితే ఈసారి మహా కుంభమేళా ముగుస్తున్న తరుణంలో మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం.


తర్వాత కుంభమేళా ఎక్కడ..

వచ్చే ఐదేళ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్ ప్రాంతాల్లో కుంభమేళా జరగనుంది. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. అర్ధ కుంభమేళా అంటే ఆరేళ్లకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. చివరి అర్ధ కుంభమేళా 2021లో హరిద్వార్‌లో జరిగింది. ఈ క్రమంలో 2027లో అర్ధ కుంభమేళా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరోవైపు 12 ఏళ్ల తర్వాత వస్తున్న పూర్ణ కుంభమేళా ఈసారి 2027లో నాసిక్‌లో జరగనుంది. తర్వాత మహా కుంభమేళా 2169లో ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది.


సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం జూలై 17, 2027న ప్రారంభమై, ఆగస్టు 17, 2027న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇది నాసిక్ నుంచి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర్‌లో జరగనుంది. 2028లో 12 ఏళ్లకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళా ఉజ్జయినిలో జరగనుంది. ఆ తర్వాత 2030లో ప్రయాగ్‌రాజ్ లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు.

కుంభమేళా ఎన్ని రకాలో తెలుసా..

  • కుంభమేళా - ప్రతి నాలుగేళ్లకు ఓసారి నిర్వహిస్తారు

  • అర్ధ కుంభమేళా - ఆరేళ్లకు ఓసారి జరుగుతుంది

  • పూర్ణ కుంభమేళా -12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు

  • మహా కుంభమేళా - 144 సంవత్సరాలకు ఓసారి నిర్వహిస్తారు


ఇవి కూడా చదవండి:

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:08 PM