Share News

Maha Kumbh Mela 2025: యుద్ధ క్షేత్రం నుంచి శాంతి కోసం!

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:04 PM

Maha Kumbh Mela 2025: పుణ్య స్నానాలు ఆచరించేందుకు కొందరు.. పర్యాటక అనుభూతి కోసం మరికొందరు.. సత్యాన్వేషణలో ఇంకొందరు.. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు తరలి వచ్చే విదేశీయులు ఎందరో.. ఎప్పట్లాగే, ఈసారి కూడా పెద్దఎత్తున విదేశీయులు..

Maha Kumbh Mela 2025: యుద్ధ క్షేత్రం నుంచి శాంతి కోసం!
Maha Kumbh Mela 2025

ప్రయాగ్ రాజ్, జనవరి 12: పుణ్య స్నానాలు ఆచరించేందుకు కొందరు.. పర్యాటక అనుభూతి కోసం మరికొందరు.. సత్యాన్వేషణలో ఇంకొందరు.. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు తరలి వచ్చే విదేశీయులు ఎందరో.. ఎప్పట్లాగే, ఈసారి కూడా పెద్దఎత్తున విదేశీయులు కుంభ మేళాకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా, యుద్ధ క్షేత్రాలైన రష్యా, ఉక్రెయిన్‌ నుంచి పలువురు ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. వారిలో ఒకరు జెహెనియా.! ఆయన రష్యాలో యోగా శిక్షకుడు. మూడేళ్ల కిందట భారత దేశానికి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన ప్రయాగ్‌రాజ్‌లో చిన్న టెంట్‌ వేసుకుని కనిపించారు. ఉక్రెయిన్‌ నుంచి ఏడాది కిందట వచ్చిన మరో ముగ్గురు కూడా ఆయనతోపాటు ఇక్కడే ఉన్నారు.

వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండడం విశేషం. మీరంతా కుంభమేళాకు ఎందుకు వచ్చారని ప్రశ్నించినప్పుడు ‘సత్యాన్వేషణ’కు అని జవాబిచ్చారు. యుద్ధాలతో రష్యా, ఉక్రెయిన్‌ అల్లకల్లోలంగా మారాయని, శాంతి, ఆధ్యాత్మిక భావాలను అన్వేషించడానికే తాము ఇక్కడికి వచ్చామని వివరించారు. ఇక, క్రియా యోగాను నేర్చుకోవడానికి కొందరు, మానసిక శాంతి కోసం మరికొందరు ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు.


Also Read:

రైతు భరోసాకు మార్గదర్శకాలివే..

‘కమలంతో పొత్తు పొడవొచ్చు..’

పండుగపూట వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్తున్నారా..

For More Telangana News and Telugu News..

Updated Date - Jan 12 , 2025 | 12:04 PM