Mahakumbh: కుమారుడి వివాహంపై గౌతమ్ అదానీ
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:43 PM
లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం చేసిన అసాధారణ ఏర్పాట్లను గౌతమ్ అదానీ ప్రశంసించారు. 'మహాకుంభ్' నిర్వహణను ఒక అధ్యయన అంశంగా మేనేజిమెంట్ ఇన్స్టిట్యూట్లు, కార్పొరేట్ సంస్థలు తీసుకోవాలని సూచించారు.

ప్రయాగరాజ్: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న 'మహాకుంభ్' (Mahakumbh)లో మంగళవారంనాడు పాల్గొన్నారు. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం చేసిన అసాధారణ ఏర్పాట్లను ప్రశంసించారు. 'మహాకుంభ్' నిర్వహణను ఒక అధ్యయన అంశంగా మేనేజిమెంట్ ఇన్స్టిట్యూట్లు, కార్పొరేట్ సంస్థలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ISKCON)తో కలిసి అదానీ గ్రూప్ 50 లక్షల మందికి ప్రసాద వితరణ చేస్తున్న కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వయంగా తన చేతులతో ప్రసాద వితరణ చేశారు. తన కుమారుడు జీత్ అదానీ వివాహానికి సంబంధించిన వివరాలను కూడా ఈ సందర్భంగా ఆయన మీడియాతో పంచుకున్నారు.
Delhi Polls: మెగా ర్యాలీలతో హొరెత్తనున్న బీజేపీ ప్రచారం.. రంగంలోకి మోదీ
సంప్రదాయబద్ధంగా వివాహం
''జీత్ కల్యాణం ఫిబ్రవరి 7న జరుగనుంది. సాధారణ ప్రజలు ఎలా వివాహ వేడుకలు జరుపుకుంటారో అలాగే ఈ వేడుకలు ఉంటాయి. చాలా సింపుల్‌గా సంప్రదాయ పద్ధతిలో వివాహం చేస్తు్న్నాం'' అని గౌతమ్ అదానీ తెలిపారు.
మహాకుంభ్ మేళాకు లక్షలాది తరలి వస్తున్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు అవిశ్రాంతంగా చేస్తు్న్న సేవలు శ్లాఘనీయమని గౌతమ్ అదానీ అన్నారు. మహాకుంభ్ మేళా నిర్వహణను ఒక అధ్యయనంగా మేనేజిమెంట్ ఇన్స్టిట్యూట్లు, కార్పొరేట్ సంస్థలు తీసుకోవాలని సూచించారు. 27 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు, రాష్ట్రాభివృద్ధిలో పాలుపుంచుకునేందుకు అదానీ గ్రూప్ కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి ముందు, అదానీ తన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో జరిగిన గంగా హారతి కార్యక్రమం, పూజల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..
Gautam Adani: 50 లక్షల మందికి ప్రసాదం పంపిణీ చేయనున్న గౌతమ్ అదానీ
Hero Vijay: ఆ ఎయిర్పోర్టుపై ప్రభుత్వానిది కపటనాటకం..
Read More National News and Latest Telugu News