Home » Gautam Adani
లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం చేసిన అసాధారణ ఏర్పాట్లను గౌతమ్ అదానీ ప్రశంసించారు. 'మహాకుంభ్' నిర్వహణను ఒక అధ్యయన అంశంగా మేనేజిమెంట్ ఇన్‌స్టిట్యూట్లు, కార్పొరేట్ సంస్థలు తీసుకోవాలని సూచించారు.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా 2025 ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో స్థానిక ప్రాంతాల భక్తులతోపాటు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. తాజాగా ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఇక్కడ 50 లక్షల మందికి స్వయంగా ప్రసాదం పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇది ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, యూఎస్ న్యాయశాఖకు సంబంధించిన లీగల్ అంశమని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అలాంటి కేసుల్లో నిర్దిష్ట విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉంటాయని తెలిపారు.
Gautam Adani Bribery Case: ప్రముఖ బిలియనీర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఆయన మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో కేసు నమోదైంది. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో ఆయన కంపెనీపై కేసు నమోదైన నేపథ్యంలో మరో విదేశీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అదానీ గ్రూప్‌నకు కష్టాలు మరింత పెరిగాయాని చెప్పవచ్చు.
అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా US ప్రాసిక్యూటర్ల లంచం ఆరోపణలు తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అదానీ గ్రూప్ తెలిపింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. దీంతోపాటు అమెరికా కోర్టు కూడా స్పందించింది.
అదానీ గ్రూప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో లంచం, మోసం ఆరోపణలు రావడంతో భారత స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో క్షణాల్లోనే కంపెనీ లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది. ఆ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోలార్ కాంట్రాక్టుల కోసం బిలియన్ల డాలర్ల లంచాలు చెల్లించి అంతర్జాతీయ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించిన ఆరోపణలపై న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీపై కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో గ్రూప్‌తో సంబంధం ఉన్న మరో ఏడుగురు కూడా ఉన్నారు.
అదానీ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు విరాళంగా అందజేసింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు.
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన రెండు కంపెనీలు విలీనమయ్యాయి. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.