Share News

Mukesh Chandrakar: వీళ్లు అసలు మనుషులేనా.. నిజాయితీ జర్నలిస్టు దారుణ హత్య.. పోస్టుమార్టం రిపొర్టు చూస్తే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 08:40 PM

Journalist Mukesh Chandrakar: ఓ నిజాయితీ గల జర్నలిస్ట్.. అవినీతిపై కథనాన్ని ప్రచురించాడు. అంతే అతడిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. హతుడి పోస్ట్‌మార్టం నివేదిక చూస్తే.. హత్య జరిగిన తీరును చూసి గజ గజ వణకాల్సిందే.

Mukesh Chandrakar: వీళ్లు అసలు మనుషులేనా.. నిజాయితీ జర్నలిస్టు దారుణ హత్య.. పోస్టుమార్టం రిపొర్టు చూస్తే..
Journalist Mukesh Chandrakar

నిజాలు నిగ్గు తీసే జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా దాడులు రోజు రోజుకు పెరిగి పోతోన్నాయి. తాజాగా ఓ జర్నలిస్ట్‌పై జరిగిన దాడి.. యావత్తు దేశాన్ని కలిచి వేసింది. అంతేకాదు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోన్న జర్నలిస్ట్‌ను అత్యంత కర్కశంగా.. అమానవీయంగా హత్య చేసిన తీరును పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది. దీనిని పరిశీలించిన ప్రతి ఒక్కరు.. ఈ హత్య జరిగిన తీరును చూసి గజగజ వణికి పోతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

రూ. 120 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లో అవినీతిని బయటపెట్టినందుకు జర్నలిస్ట్ ముఖేష్‌ను దారుణంగా హత్య చేశారు. అతడిని హంతకులు దారుణంగా కొట్టడమే కాకుండా.. గుండెను చీల్చి బయటకు తీశారు. అలాగే అతడి కాలేయాన్ని నాలుగు ముక్కులు చేశారు. అతడి పక్క టెముకులు ఐదు చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఈ విషయాలన్నీ పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టమైంది. ఏళ్లకు ఏళ్ల సర్వీసు ఉన్న తమ వైద్య వృత్తిలో ఈ తరహా హత్యను ఇప్పటి వరకు చూడలేదంటూ ఈ పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు సైతం స్పష్టం చేస్తున్నారంటే.. ఈ హత్యను ఎంత పాశవికంగా చేశారో అర్థమవుతోంది. అంతేకాదు.. ఈ హత్యలో ఇద్దరు కంటే ఎక్కువ మందే పాల్గొన్నారంటూ సదరు వైద్యులు వెల్లడించారు.


ప్రీలాన్స్ జర్నలిస్ట్‌గా..

Mukesh.jpg

బస్తర్‌కు చెందిన ముఖేష్.. ఓ జాతీయ మీడియా సంస్థలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. అయితే బస్తర్ ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో రోడ్డు ప్రాజెక్ట్ పనుల్లో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి చోటు చేసుకున్నదంటూ అతడు కథనం వెలువరించాడు. మొదట రూ. 50 కోట్ల టెండర్‌తో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్.. పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ రూ. 120 కోట్లుకు చేరుకుందని తెలిపారు.

Also Read: కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు

Also Read: విడాకులు ఉండవు.. పొత్తుపై తేల్చేసిన లోకేష్


పచ్చబొట్టు ఆధారంగా..

అనంతరం అతడు అదృశ్యమైనాడు. అనంతరం ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఇంట్లో ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో శవమై కనిపించాడు. పచ్చబొట్టు ఆధారంగా ఆ మృతదేహం ముఖేష్‌దని గుర్తించారు. అందుకు సంబంధించి.. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు ముఖేష్ బంధువులే కావడం గమనార్హం.

Also Read: షేక్ హసీనా అరెస్ట్‌కు మళ్లీ వారెంట్ జారీ

Also Read: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 32 మందికి గాయాలు


ఎక్కడ దొరికాడంటే..

ముఖేష్ హత్య కేసులో కీలక నిందితుడైన సురేష్ చంద్రకర్‌ను పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఇతడు ముఖేష్‌కు దూరపు బంధువు అవుతాడు. ముఖేష్ అదృశ్యమైన రోజే.. సురేష్ సైతం అదృశ్యమయ్యడు. దీంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. దీంతో హైదరాబాద్‌లోని తన కారు డ్రైవర్ ఇంట్లో సురేష్ దాక్కొని ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అతడిని అరెస్ట్ చేశారు. అందుకోసం 200 సీసీ కెమెరాలు, 300 మొబైల్ ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే కాంట్రాక్టర్ సురేష్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. ఈ కేసులో భాగంగా అతడి కుటుంబ సభ్యులను సైతం అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: తురకా కిషోర్‌ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు

Also Read: రెచ్చిపోయిన మావోయిస్టులు.. భారీ సంఖ్యలో జవాన్లు మృతి


అంతా తానై..

అయితే ఈ హత్య ఎలా జరిగిందనే విషయాన్ని నిందితుల నుంచి పోలీసులు రాబట్టినట్లు సమాచారం. దీంతో ముఖేష్‌ హత్యకు కర్త, కర్మ, క్రియా అంతా సురేష్ చంద్రకర్ అని పోలీసులు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా ఓ జర్నలిస్ట్‌ను ఇంత దారుణంగా.. అత్యంత పాశవికంగా ఇలా హత్య చేయడం చూస్తుంటే.. ఈ తరహా ఘటనలపై ప్రభుత్వాలు స్పందిస్తాయా అనే సందేహాలు సైతం సర్వత్ర వ్యక్తమవుతోన్నాయి.

For National News And Telugu News

Updated Date - Jan 06 , 2025 | 08:56 PM