Share News

Hero Vijay: హీరో విజయ్ వార్నింగ్.. కపట నాటకాలతో జాక్టో-జియోను మోసగించొద్దు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:09 PM

ప్రముఖ హీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాయమాటలతో మోసం చేయొద్దంటూ ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తమ మనుగడను సాధించిన దాఖలాలు లేవని ఆయన హెచ్చరించారు.

Hero Vijay: హీరో విజయ్ వార్నింగ్.. కపట నాటకాలతో జాక్టో-జియోను మోసగించొద్దు

చెన్నై: తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాయమాటలతో మోసం చేయొద్దంటూ తమిళగ వెట్రికళగం నేత విజయ్‌(Vijay) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డీఎంకే ప్రభుత్వం యేళ్ల తరబడి ఆడుతున్న కపటనాటకాన్ని ఓర్చుకోలేకే జాక్టో-జియో నాయకులు, సభ్యులు ఆదివారం ఆందోళన చేపట్టారన్నారు. ఈ మేరకు ఆయన ఓ సుదీర్ఘ ప్రకటన జారీ చేస్తూ తమ న్యాయమైన కోర్కెల సాధనకు జాక్టో- జియో సంఘాలు జరుపుతున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతునిస్తుందని విజయ్‌ ప్రకటించారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్‏పై కేసు నమోదు.. విషయం ఏంటంటే..


2003 ఏప్రిల్‌ ఒకటి తర్వాత ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్‌ పద్ధతిని అమలు చేయకుండా కాంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీము అమలు చేసి రిటైర్మెంట్‌ తర్వాత ప్రతినెలా ఇచ్చే పింఛన్‌ను వీరికి వర్తింపజేయడం లేదని విజయ్‌ ఆరోపించారు. జాక్టో- జియో ఆందోళన రాష్ట్రంలోని లక్షలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు కుటుంబాలకు సంబంధించిన విషయమనే భావన ప్రభుత్వానికి లేకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు.


nani5.2.jpg

డీఎంకే ప్రభుత్వం పట్టుదలలకు పోకుండా, వీరి సమస్యలను రాజకీయ పరమైన భావనతో కాకుండా మానవతా భావంతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రచారార్భాటాలకే ప్రాధాన్యం ఇస్తున్న డీఎంకే ప్రభుత్వం నాలుగేళ్లకు ముందు ఎన్నికలమేనిఫెస్టోలో 309వ హామీ (జాక్టో-జియో సంఘాలకిచ్చిన హామీ)ని ఇకనైనా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం

ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

న్యాయవాది దారుణ హత్య

పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2025 | 12:09 PM