Home » Hero Vijay
అగ్రహీరో విజయ్ స్థాపించి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది దీనిలో భాగంగా పార్టీ విజయావకాశాలపై ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసి గెలిచి అధికారం చేపట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
వక్ఫ్ సవరణ చట్టం-2025పై తమిళగ వెట్రీ కజగం అధ్యక్షుడు, సినీనటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు.
ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ పోటీ లేదని, అధికార డీఎంకే పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని ఆయన పేర్కొనడం రాష్ర్ట వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత, ప్రముఖ హీరో విజయ్ ఒంటరిగానే మిగిలిపోనున్నారా.., వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగానే తలపడనున్నారా.. అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అలా అయితే.. అతి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పావంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ప్రముఖ హీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాయమాటలతో మోసం చేయొద్దంటూ ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తమ మనుగడను సాధించిన దాఖలాలు లేవని ఆయన హెచ్చరించారు.
దేశంలో తాజా జనాభా లెక్కల ప్రకారం ఎంపీల సంఖ్య పెంచి, వారిని అలంకార బొమ్మలుగా కూర్చొబెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రశ్నించారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే)పార్టీ స్థాపించిన సినీ హీరో విజయ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని హీరో విశాల్ ప్రశ్నించారు. విజయ్ రాజకీయ ప్రవేశంపై మీ స్పందన ఏంటని విశాల్ను మీడియా ప్రశ్నించగా, దానిపై ఆయన స్పందిస్తూ ‘ముందు విజయ్ను మీడియా ముందుకు రమ్మనండి.
సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్లా ఎదిగి, వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పగటికలలు కంటున్నాడని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీమంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) విమర్శించారు,
ప్రముఖ సినీనటి రంజనా నాచ్చియార్ నటుడు విజయ్(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంలో చేరుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం బీజేపీ(BJP)కి గుడ్బై చెప్పిన రంజనా(Ranjana) గురువారం టీవీకే వార్షికోత్సవాల్లో ప్రత్యక్షమయ్యారు.
1967, 1977సంవత్సరాల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కావడం తథ్యమని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Film actor Vijay) ధీమా వ్యక్తం చేశారు.