Ranya Rao: ప్రైవేటు భాగాల్లో బంగారు దాచిపెట్టి.. రన్యారావుపై షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:35 PM
దోషులను శిక్షించాల్సిందేనని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన ఆయనను సమర్ధిస్తారా? అని సీనియర్ ఐపీఎస్ అధికారి, రన్యరావు సవతి తండ్రి రామచంద్రరావును పరోక్షంగా ఉద్దేశించి బసంగౌడ్ పాటిల్ యత్నాల్ ప్రశ్నించారు.

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసులో (Gold Smuggling) కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యారావుకు సంబంధించి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ (Basangouda Patil Yatnal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కొందరు మంత్రుల ప్రమేయం ఉందని కూడా అన్నారు. మార్చి 3న 14 కిలోల బంగార స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావు పట్టుబడటం కర్ణాటకలో సంచలనమైంది.
RG Kar Case: కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చు.. బాధితురాలి తల్లిదండ్రులకు సుప్రీం అనుమతి
దీనిపై బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సంచలనమవుతోంది. దోషులను శిక్షించాల్సిందేనని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన ఆయనను సమర్ధిస్తారా? అని సీనియర్ ఐపీఎస్ అధికారి, రన్యరావు సవతి తండ్రి రామచంద్రరావును పరోక్షంగా ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని రామచంద్రరావు తోసిపుచ్చినప్పటికీ ఆయనను బాధ్యతలనుంచి తప్పించి, కంప్సర్సరీ సెలవుపై రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
''కస్టమ్స్ అధికారుల వైఫల్యం ఉంది. వారిపై చర్చలు తీసుకోవాలి. ఆమె (రన్యారావు) తన శరీరమంతా బంగారంతో కప్పేసింది. ఆమె తన శరీరంలోని ప్రైవేటు భాగాల్లో బంగారు దాచిపెట్టి స్మగ్లింగ్ చేసింది'' అని ఆ వీడియోలో చెప్పడం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. సెక్యూరీటి క్లియరెన్స్‌లో ఆమెకు ఎవరు సాయం చేశారో, బంగారం ఎలా తీసుకొచ్చారనే పూర్తి సమాచారం తాను సేకరించానని, అసెంబ్లీలో దీన్ని వెల్లడిస్తానని అన్నారు. రన్యారావు ఎక్కడెక్కడ బంగారం దాటిపెట్టిందో కూడా బయటపెడతానన్నారు.
కాగా, స్మగ్లింగ్ వ్యవహారంలో మంత్రుల ప్రమేయం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల తెలిపారు. రన్యారావు సైతం తాను అమాయకురాలినని, తనను స్మగ్లింగ్ కేసులో ఇరికాంచరని చెబుతున్నారు. అయితే ఎవరు ఆమెను ఇరికించారు, ఇందులో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..