Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:55 AM
మహా కుంభమేళాకు భక్తజనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజు కూడా దాదాపు 50 లక్షల మందికిపైగా వెళ్తున్నారు. అయితే ఇప్పటివరకు గత 15 రోజుల్లో ఎంత మంది ఈ మేళాను సందర్శించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రయాగ్‌రాజ్ (prayagraj) మహా కుంభమేళాకు (Kumbh Mela 2025) జనాలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో రేపు జనవరి 29న (రెండవ షాహి స్నాన్) మౌని అమావాస్య సందర్భంగా రెండు కోట్ల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు స్నానం చేసిన వారి సంఖ్య గత 15 రోజుల్లో దాదాపు 14 కోట్లకు చేరుకుందని సనాతన బోర్డు పేర్కొంది. నిన్న సోమవారం ఒక్క రోజే 1.55 కోట్ల మంది కుంభ స్నానం ఆచరించారు. ఇందులో 10 లక్షల కల్పవాసీలు ఉన్నారు. ఇక వాస్తవ సంఖ్య ప్రకారం చూస్తే 14.76 కోట్ల మంది స్నానం ఆచరించారని చెబుతున్నారు.
ఒక్కరోజే 3.5 కోట్ల మంది..
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఉత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కుంభమేళా వచ్చే నెల 26 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో జనవరి 23 నాటికి 10 కోట్ల మంది భక్తులు సందర్శించారు. మకర సంక్రాంతి (జనవరి 14) రోజు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడానికి 3.5 కోట్ల మంది భక్తులు వచ్చారు. ఈ ఉత్సవం ముగిసే సమయానికి మొత్తం 45 కోట్ల మంది భక్తులు వస్తారని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవాలలో ఒకటిగా నిలిచింది.
పర్యాటక రంగంలో ఉత్తరప్రదేశ్ కొత్త రికార్డు
2024లో ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 65 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌ను సందర్శించారు. ఇందులో ప్రధానంగా మధుర, కాశీ, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, కుషినగర్ టాప్ 5 పర్యాటక కేంద్రాలుగా నిలిచాయి.
సనాతన బోర్డు డిమాండ్
సోమవారం జరిగిన ధర్మ సంసద్‌లో సనాతన బోర్డు గురించి కీలక ప్రకటనలు చేసింది. సనాతన బోర్డు ఏర్పడటంతో హిందూ దేవాలయాల నిర్వహణ, సంరక్షణ, పర్యవేక్షణకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ బోర్డు ద్వారా లక్షల కోట్ల విలువైన ఆస్తులు, దేవాలయాల మెరుగైన నిర్వహణ చేయనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి సనాతన బోర్డుకు 200 పైగా దేవాలయాల నిర్వహణ అందించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ బోర్డు స్వతంత్రంగా పనిచేస్తూ, సనాతన ధర్మం సంరక్షణ కోసం కీలకమైన కార్యక్రమాలు చేపడతున్నట్లు చెప్పారు. ఇతర బోర్డులతో పోలిస్తే సనాతన బోర్డు ప్రత్యేకంగా హిందూ దేవాలయాల నిర్వహణ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతుంది. అయితే వక్ఫ్ బోర్డు మాత్రం మసీదులు, సమాధులు, దర్గాల నిర్వహణతో సంబంధిత విషయాలు చూసుకుంటుంది.
ఇవి కూడా చదవండి:
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News