Indai-Pakistan: అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా పాక్.. దాయాది దేశంపై భారత్ నిప్పులు
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:29 PM
భారత్‌లో జమ్మూకశ్మీర్ అంతర్భాగమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని హరీష్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను పాక్ దురాక్రమణ చేసిందని తూర్పారబట్టారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడూ అని తేడా ఉండదన్నారు.

న్యూయార్క్: జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై పదేపదే ప్రస్తావిస్తున్న పాక్ మరోసారి ఇదే అంశంపై భారత్‌పై విషం చిమ్మింది. పాకిస్థాన్ వ్యాఖ్యలను భారత్ అంతే ధీటుగా తిప్పికొట్టింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ కేంద్రంగా నిలుస్తోందని, ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ తాము బాధులమని ఆదేశం చెప్పడం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ ఎగదోస్తున్న జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల వల్ల తాము బాధితులమని పేర్కొంది.
USA Illegal Immigrants Video : అక్రమ వలసదారులకు సంకెళ్లు, గొలుసులు.. వైట్‌హౌస్ పోస్ట్ చేసిన వీడియో వైరల్.
చైనా అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ చేసిన వ్యాఖ్యలపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. ''పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా నిలుస్తోంది. ఐరాస ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20కి పైగా సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వాటిని పెంచిపోషిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న వారే ఉగ్రవాద బాధితులమని చెప్పుకోవడం హాస్యాస్పదం. జైషే మహమ్మద్, హర్కతుల్ ముజాహిద్దీన్ వంటి డజనుకు పైగా ఉగ్రవాద సంస్థలను పాక్ ఉసిగొల్పుతుండటంతో మేము బాధితులమవుతున్నాం'' అని అన్నారు.
జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం
భారత్‌లో జమ్మూకశ్మీర్ అంతర్భాగమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని హరీస్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను పాక్ దురాక్రమణ చేసిందని తూర్పారబట్టారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడూ అని తేడా ఉండదని, అమాయక ప్రజలపై ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్ధన ఉండదని అన్నారు. పాకిస్థాన్ చెప్పే అబద్ధాలు, తప్పుడు సమాచారం వాస్తవ విరుద్ధమని ఖండించారు.
జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన ఎన్నికలను హరీష్ ప్రస్తావిస్తూ, అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రజల ఎంపిక చాలా స్పష్టంగా ఉందని, పాకిస్థాన్‌లా కాకుండా అక్కడ ప్రజాస్వామ్యం బలంగా ఉందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Delhi CM Oath: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్, అతిషి హాజరవుతారా?
PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..
Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.