Share News

ISRO: డాకింగ్‌పై సందేహాలు..!

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:51 AM

అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించడం కోసం రూ.370 కోట్ల వ్యయంతో చేపట్టిన స్పేడెక్స్‌ మిషన్‌లో ముందడుగు వేసినట్టే కనిపించిన ఇస్రో మరోసారి వెనక్కు తగ్గింది...! శనివారం సాయంత్రం ఎస్‌డీఎక్స్‌01, ఎస్‌డీఎక్స్‌02 ఉపగ్రహాల మధ్య దూరం 230 మీటర్లు ఉంది.

ISRO: డాకింగ్‌పై సందేహాలు..!

బెంగళూరు, జనవరి 13: అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించడం కోసం రూ.370 కోట్ల వ్యయంతో చేపట్టిన స్పేడెక్స్‌ మిషన్‌లో ముందడుగు వేసినట్టే కనిపించిన ఇస్రో మరోసారి వెనక్కు తగ్గింది...! శనివారం సాయంత్రం ఎస్‌డీఎక్స్‌01, ఎస్‌డీఎక్స్‌02 ఉపగ్రహాల మధ్య దూరం 230 మీటర్లు ఉంది. తర్వాత ఆ దూరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిన ఇస్రో.. ఆదివారం ఉదయానికల్లా దాన్ని 3 మీటర్లకు తగ్గించడంలో విజయం సాధించింది. కానీ.. ఆ తర్వాత ఉపగ్రహాల మధ్య దూరాన్ని తగ్గించే ట్రయల్‌ ముగిసిందని, వాటిని సురక్షిత దూరానికి తరలించామని, ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్‌ చేపడతామని ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది.


ఉపగ్రహాలను చేరువ చేయడం ఉత్సాహాన్ని రేపినా.. మళ్లీ వాటిని సురక్షిత దూరానికి తరలించడం పలు సందేహాలకు తావిస్తోంది. దీనిపై పలువురు నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఈ రెండు ఉపగ్రహాలు డాకింగ్‌కు అనుకూలంగా లేవని అంటుంటే.. మరికొందరు ఇస్రో ఊహించిన, ప్రకటించిన దానికంటే రెండు స్పేస్‌క్రా్‌ఫ్టల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలు, లెక్కలు తప్పాయని మరికొందరు విమర్శిస్తున్నారు. స్పేస్‌ డాకింగ్‌ కోసం ఇస్రో గత నెల 30న స్పేడెక్స్‌ మిషన్‌ ద్వారా జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి చేర్చింది.

Updated Date - Jan 14 , 2025 | 04:51 AM