Share News

Kunal Kamra: కునాల్ కామ్రాకు తాత్కాలిక బెయిల్

ABN , Publish Date - Mar 28 , 2025 | 06:54 PM

ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కామ్రాకు మార్చి 31న ముంబై‌ పోలీసులు సమ్లన్లు పంపారు. దీనికి ముందు కూడా ఆయనకు పోలీసులు సమన్లు పంపగా వారం రోజులు గడువు ఇవ్వాలని కామ్రా కోరారు. అయితే అందుకు నిరాకరించిన పోలీసులు రెండోసారి సమన్లు పంపారు.

Kunal Kamra: కునాల్ కామ్రాకు తాత్కాలిక బెయిల్

చెన్నై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై వివాదాస్పద వ్యాఖ్యల వీడియోపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra)కు మద్రాసు హైకోర్టు (Madras High Court) ఏప్రిల్ 7వ తేదీ వరకూ తాత్కాలిక ముందస్తు బెయిల్ (Interm anticipatroy bail) ఇచ్చింది. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున మహారాష్ట్ర కోర్టుకు వెళ్లడం లేదని తన పిటిషన్‌లో కామ్రా మద్రాసు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో తమిళనాడు విల్లుపురం జిల్లాలోని వనూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వద్ద పూచీకత్తు సమర్పించాలనే షరతు మీద కామ్రాకు మద్రాసు హైకోర్టు తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

Cash Discovery Row: జస్టిస్ వర్మ బదిలీని నోటిఫై చేసిన కేంద్రం


ముంబై నుంచి 2021లో తాను తమిళనాడుకు వెళ్లిపోయానని, అప్పటి నుంచి ఆర్డినరీ రెసిడెంట్‌గా అక్కడ ఉన్నానని, ముంబై పోలీసులు అరెస్టు చేస్తారనే భయం తనకుందని కామ్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జడ్జి ప్రస్తావిస్తూ, విల్లిపురం జిల్లాలో పిటిషనర్ (కామ్రా) ఉంటున్నారని, ఆయనపై రిజిస్టర్ అయిన ఆర్-2 ఫైల్‌ కేసు కింద పోలీసలు అరెస్టు చేస్తారని భయపడుతున్నారని అన్నారు.


కాగా, ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కామ్రాకు మార్చి 31న ముంబై‌ పోలీసులు సమ్లన్లు పంపారు. దీనికి ముందు కూడా ఆయనకు పోలీసులు సమన్లు పంపగా వారం రోజులు గడువు ఇవ్వాలని కామ్రా కోరారు. అయితే అందుకు నిరాకరించిన పోలీసులు రెండోసారి సమన్లు పంపారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్.. జస్టిస్ వర్మపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

Bengaluru: మా చేతులు కట్టేశారు..

Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ

For National News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 06:59 PM