Share News

Mahakumbh: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

ABN , Publish Date - Jan 28 , 2025 | 05:39 PM

Mahakumbh: మౌని అమావాస్య నేపథ్యంలో 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌కు చేరుకొనున్నారు. వారి కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతోన్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

Mahakumbh: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

పట్నా, జనవరి 28: మహాకుంభమేళ నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతోన్నారు. ఆ క్రమంలో జనవరి 29వ తేదీ.. అంటే బుధవారం మౌని అమావాస్య. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు 10 కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. అందులోభాగంగా రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తుల కోసం దాదాపు 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మరోవైపు గత 17 రోజుల్లో 15 కోట్ల మంది యాత్రికులు ప్రయోగ్ రాజ్‌లో ఈ పవిత్ర స్నానం ఆచరించారని పేర్కొంది. మహాకుంభమేళకు వస్తోన్న యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించింది.

జనవరి 13, 14 తేదీల్లో భారీగా యాత్రికులు ఈ కుంభమేళకు తరలి వచ్చారని చెప్పింది. అయితే బుధవారం ఒక్క రోజే 60 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని.. అలాగే 190 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. ఇక ఈ మార్గంలో 110 సాధారణ రైళ్లు యాథావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.


అయితే ప్రయాగ్ రాజ్ నుంచి ప్రతి 4 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సతీష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొంటూ.. తాము ముందుకు వెళ్తున్నామన్నారు. అదే విధంగా రైల్వే స్టేషన్లతోపాటు రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం 10 వేల మంది రైల్వే రిపబ్లికన్ ఫోర్స్‌కు చెందిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామన్నారు.

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం


ఇంకోవైపు.. మౌని అమావాస్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతను ముమ్మరం చేసింది. త్రివేణి సంగమ ప్రాంతంలో నిఘాతోపాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. అందులోభాగంగా ఎఐ ఆధారిత సీసీ టీవీ కెమెరాలతోపాటు డ్రోనులను ఏర్పాటు చేశారు. అయితే జనవరి 14వ తేదీ అంటే.. మకర సంక్రాంతి రోజు 3.5 కోట్ల మంది భక్తులు, సాధువులు అమృత స్నానం ఆచారించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తి గణాంకాలతో వివరించింది.

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..


ఈ రోజు.. అంటే జనవరి 28వ తేదీ మంగళవారం ఉదయం 8.00 గంటల వరకు 45 లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచారించారని చెప్పింది. అదీకాక రేపు బుధవారం మౌని అమావాస్య నేపథ్యంలో బుధవారం ఉదయం 6.45 గంటలకు త్రివేణి సంగమ ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించాలని యోగి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.


అఖాడాలతోపాటు సాధవులు, సన్యాసులు ఊరేగింపుగా ఈ అమృత స్నానం ఆచరించేందుకు త్రివేణి సంగమానికి విచ్చేస్తారు. ఇది ఓ ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక పవిత్ర నదుల ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని విశ్వాసం సర్వత్ర వ్యక్తమవుతోంది. సూర్యుడు, చంద్రుడితోపాటు బృహస్పతి కలయిక ఆధారంగా అమృత స్నానం తేదీలను జ్యోతిష శాస్త్ర పండితులు నిర్ణయిస్తారు.


మరోవైపు హిందూ క్యాలెండర్ ప్రకారం.. మౌని అమావాస్య మాఘ కృష్ణ అమావాస్య నాడు వస్తుంది. ఇది అత్యంత పవిత్రమైన తేదీగా పరిగణిస్తారు. ఈ రోజున పవిత్ర నదుల్లోని నీరు అమృతంగా మారుతుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది. మౌని అమావాస్యను 'సాధువుల అమావాస్య' అని కూడా అంటారు. మౌని అమావాస్య రోజు.. స్నానం సాంప్రదాయకంగా మౌనంగా చేస్తారు.

For National News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 05:40 PM