Share News

Mahakumbh 2025: తొలిరోజు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 07:23 PM

పుష్య పౌర్ణమి సందర్భంగా బీహార్, హర్యానా, బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో వివిధ ఘాట్లు కిటకిలలాడాయి.

Mahakumbh 2025: తొలిరోజు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు

ప్రయాగ్‌రాజ్ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌ (Prayagraj)లో ప్రారంభమైన మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025)కు తొలిరోజే భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమంలో 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. సోమవారంనాడు పుష్య పౌర్ణమి సందర్భంగా బీహార్, హర్యానా, బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో వివిధ ఘాట్లు కిటకిలలాడాయి. మహాకుంభమేళా వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అభినందనలు తెలిపారు. పుష్పమాస పౌర్ణమి రోజున త్రివేణి సంఘంలో పవిత్ర స్నానాల కోసం విచ్చేసి సాధువులు, కల్పవాసీలు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Maha Kumbh Mela 2025: కుంభమేళా చేరుకున్న బాహుబలి బాబా.. 800 కిలోమీటర్లకుపైగా సైకిల్ ప్రయాణం


''మహా కుంభమేళా తొలిరోజు సనాతన ధర్మాన్ని ఆచరించే 1.50 కోట్ల మంది స్వచ్ఛమైన త్రివేణీ జలాల్లో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా ఈ పండుగను విజయవంతం చేశారు. ఇందుకు సహకరించిన మహాకుంభ మేళా అడ్మినిస్ట్రేషన్, ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రయాగరాజ్, స్వచ్ఛాగ్రహీలు, గంగా సేవాదూత్‌లు, కుంభ్ సేవక్లు, మత-సామాజిక సంస్థలు, వివిధ వాలంటీర్లు, మిత్రులు, మీడియా ప్రపంచం సహా మహాకుంభ్‌తో మమేకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తు్న్నాను'' అని యోగి పేర్కొన్నారు.


భిన్నత్వంలో ఏకత్వం

'మహాకుంభ్' భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని చాటుతూ భిన్న సంస్కృతులను ఏకం చేస్తోందని యోగి ఆదిత్యనాథ్ ఒక ట్వీట్‌లో అభివర్ణించారు. సాంస్కృతీ సమ్మేళనం ఎక్కడుంటుందో విశ్వాసం, సామరస్యం అక్కడే ఉంటుందన్నారు. ప్రయోగ్‌రాజ్ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. కాగా, తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలిగాలులు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలకు ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు. వయోభేదం లేకుండా అన్ని రంగాలకు చెందిన ప్రజలు పవిత్ర స్నానాలతో పులకించిపోయారు. భజనలు, జై గంగా మయ్యా నినాదాలు మధ్య 'మహాకుంభ్' అంగరంగ వైభవంగా మొదలైంది.


ఇవి కూడా చదవండి..

Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 07:29 PM