Share News

Maoists: దెబ్బ మీద దెబ్బ.. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

ABN , Publish Date - Mar 30 , 2025 | 05:32 PM

Maoists: వరుస ఎదురు దెబ్బలతో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి 29వ తేదీ శనివారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 18 మంది మరణిించారు. అదీకాక ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మార్చి 30వ తేదీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Maoists: దెబ్బ మీద దెబ్బ.. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ
Maoists Surrender In Bijapur

రాయ్‌పూర్, మార్చి 30: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతోన్నాయి. అలాంటి వేళ బీజాపూర్ జిల్లాలో పోలీసులు ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. దాదాపు 50 మంది మావోయిస్టులు ఆదివారం పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ కీలక నేత రవీంద్ర సైతం ఉన్నారు. లొంగిపోయిన వారిలో 14 మందిపై రూ. 68 లక్షల రివార్డు ఉందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు ప్రధాని మోదీ ఈ రోజు అంటే ఆదివారం.. మార్చి 30వ తేదీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 33, 700 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాంటి కొన్ని గంటల ముందు ఇంత భారీగా మావోయిస్టులు లొంగి పోవడం గమనార్హం.

2026, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడమే కాదు.. ఓ నిర్దిష్ట లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకొంది. అందులోభాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం.. మావోయిస్టులకు రక్షణ కవచంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఆ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య పలు సందర్భాల్లో జరిగిన హోరా హోరీ కాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు మరణించారు.

తాజాగా మార్చి 29వ తేదీన సైతం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో దాదాపు 18 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో 11 మంది మహిళలే ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 134 మంది మావోయిస్టులు మరణించారు. అలాగే ఏడు వందలకు పైగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఇంకోవైపు వరుస ఎన్‌కౌంటర్ ఘటనలపై కేంద్రం సైతం స్పందిస్తుంది. ఆపరేషన్ కగార్ లక్ష్యంగా జరుగుతోన్న ఈ ఎన్‌కౌంటర్ల వల్ల మావోయిస్టులు ఉనికిని కోల్పోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు పార్టీ సైతం స్పందించింది. ఈ ఎన్‌కౌంటర్లకు నిరసనగా మార్చి 4వ తేదీ శుక్రవారం బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు లేఖను విడుదల చేసింది


అదీకాక.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వారి ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని కేంద్రం ఇప్పటికే పిలుపు నిచ్చింది. అలాగే లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ప్రకటించింది. అయితే మావోయిస్టులు మాత్రం లొంగిపోయేందుకు ఏ మాత్రం ముందుకు రావడం లేదు.


ఓ వేళ వచ్చిన చాలా కొద్ది మంది మాత్రమే లొంగిపోతున్నారు. కానీ ఇలా 50 మంది మావోయిస్టులు ఒకే సారి లొంగిపోవడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంకోవైపు మార్చి 29వ తేదీ వరుసగా రెండు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్న మరునాడే.. ఇలా మరో 50 మంది మావోయిస్టులు లొంగిపోవడం పట్ల పోలీసులు, భద్రతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది మావోయిస్టులు లొంగిపోతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

T Jayaprakash Reddy: నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి

40 ఏళ్లుగా మసిలే జలధారలు!

టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

For National News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 05:34 PM