Share News

Mark Zukererg: జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:41 PM

తప్పుడు సమచారం వల్ల ప్రజాస్వామ్య దేశం ప్రతిష్ట దెబ్బతింటుందని, చేసిన తప్పును సరిచేసుకునేందుకు ఇటు పార్లమెంటుకు, అటు ప్రజలకు మోటా సంస్థ క్షమాపణ చెప్పాలని నిషాకాంత్ దూబే అన్నారు.

Mark Zukererg: జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు

న్యూఢిల్లీ: భారత్‌లో ఇటీవల జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలను వక్రీకరిస్తూ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zukerberg) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆయనకు సమన్లు పంపాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. బీజేపీ ఎంపీ, కమ్యూనిషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానల్ చైర్మన్ డాక్టర్ నిషికాంత్ దూబే (Dr.Nishikant Dubey) ఈ విషయాన్ని వెల్లడించారు. తప్పుడు సమచారం వల్ల ప్రజాస్వామ్య దేశం ప్రతిష్ట దెబ్బతింటుందని, చేసిన తప్పును సరిచేసుకునేందుకు ఇటు పార్లమెంటుకు, అటు ప్రజలకు మోటా సంస్థ క్షమాపణ చెప్పాలని అన్నారు.

Arvind Kejriwal: గోల్డ్ చైన్‌లు పంచుతున్నారు, తీసుకోండి కానీ...


లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జుకర్‌బర్గ్ చేసిన వాదనను ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పుపట్టారు. 2024 ఎన్నికల్లో భారత్ సహా ప్రపంచ దేశాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ ఇటీవల ఆరోపించారు. ఆయన వాదనను అశ్విని వైష్ణవ్ ఖండిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేపై ఓటర్లు విశ్వాసం ఉంచి మూడోసారి గెలిపించారని చెప్పారు. 64 కోట్ల మంది భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారని చెప్పారు.


కోవిడ్ తర్వాత భారత్ సహా అన్ని దేశాల్లో అధికార ప్రభుత్వాలు ఓడిపోయాయని చెప్పడం సరికాదని, 80 కోట్ల మందికి ఉచిత ఆహారం, 220 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేసిందని, మోదీ సాహసోపేత నిర్ణయాలే ఎన్నికల్లో విజయానికి నిదర్శనంగా నిలిచాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. వాస్తవాలను, విశ్వసనీయతను కాపాడుకోవాలని మెటాను ట్యాగ్ చేస్తూ అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేసారు. ఈ క్రమంలోనే మెటా సంస్థకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు పంపనున్నట్టు నిషికాంత్ దూబే ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..

Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 14 , 2025 | 04:41 PM