Ranya Rao: రన్యారావు కేసు మరో మలుపు.. హవాలా సొమ్ముతో బంగారం కొనుగోలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 06:45 PM
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావు 12.56 కోట్లు విలువచేసే బంగారంతో పట్టుబడింది. ఆ తర్వాత ఆమె నివాసంపై జరిపిన దాడుల్లో 2.06 కోట్లు విడుదల చేసే నగలు, 2.06 కోట్ల నగదు పట్టుబడింది.

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling) చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బంగారం కొనుగోలు కోసం ఆమె హవాలా డబ్బును వినియోగించినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) విచారణలో తేలింది. రన్యారావు ఈ విషయాన్ని అంగీకరించినట్టు డీఆర్ఐ తరఫు న్యాయవాది మధురావు కోర్టుకు తెలిపారు. రన్యారావు బెయిలు పిటిషన్‌పై విచారణ సందర్భంగా డీఆర్ఐ తమ విచారణలో తేలిన విషయాలను కోర్టు ముందుంచింది. రన్యారావు బెయిలు పిటిషన్‌ను తొలుత దిగువ కోర్టు, ఆ తర్వాత ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తోసిపుచ్చాయి.
Eknath Shinde-Kunal Kamra: సుపారీ తీసుకున్నారేమో?.. కునాల్ వ్యాఖ్యలపై షిండే
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావు 12.56 కోట్లు విలువచేసే బంగారంతో పట్టుబడింది. ఆ తర్వాత ఆమె నివాసంపై జరిపిన దాడుల్లో 2.06 కోట్లు విడుదల చేసే నగలు, 2.06 కోట్ల నగదు పట్టుబడింది. కాగా, రన్యారావు, ఈ కేసులో అరెస్టయిన ఆమె ఫ్రెండ్ తరుణ్ రాజ్ దుబాయ్‌కు 26 సార్లు వెళ్లారని, ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేవారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. రెన్యారావు పంపిన డబ్బులతో అతను టిక్కెట్ కొనుక్కొని దుబాయి నుంచి హైదరాబాద్ వెళ్లినట్టు అధికారులు ఆరోపించారు. తరచు ఈ పర్యటనలు జరపడం, ఒకేరోజులో వెళ్లిరావడంతో పెద్దఎత్తున ఇండియాకు గోల్డ్ స్మగ్లింగ్ జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
రన్యారావు గత పర్యటనలు కూడా డీఆర్ఐ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2023-25 మధ్య ఆమె 52 సార్లు దుబాయ్ పర్యటించగా, వాటిలో 45 ట్రిప్‌లు ఒకరోజులో వెళ్లివచ్చినవే. ఒక్క 2025 జనవరిలోనే రన్యారావు 27 సార్లు బెంగళూరు, గోవా, ముంబై మీదుగా దుబాయ్ వెళ్లారు. రన్యారావు సవతి తండ్రి డీజీపీ రామచంద్రారావు నిర్దిష్ట ఆదేశాలతోనే రన్యారావుకు తాను సహకరించినట్టు ప్రొటోకాల్ ఆధికారి దర్యాప్తు అధికారులకు వెల్లడించారు. దీంతో చర్యలకు దిగిన పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ రామచంద్రారావును ఇటీవల కంపల్సరీ సెలవుపై పంపారు.
ఇవి కూడా చదవండి..