Kunal Kamra Joke Row: కునాల్ కామ్రాకు రెండోసారి నోటీసులు.. మరింత గడువుకు నిరాకరణ
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:42 PM
మార్చి 25న ఇన్వెస్టిగేటింగ్ అధికారి ముందు హాజరుకావాలంటూ తొలుత ముంబై పోలీసులు కామ్రాకు నోటీసులిచ్చారు. స్టాండప్ కామెడీ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎంఐడీసీ పోలీసులు ఎఫ్ఐఆర్ఐ నమోదు చేసినప్పటికీ తదుపరి విచారణను ఖర్ పోలీసులకు అప్పగించారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra)కు ముంబై పోలీసులు మరోసారి నోటీసు పంపారు. అధికారుల ముందు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలంటూ ఆయన తరపు లాయర్ చేసిన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. బుధవారంనాడు రెండోసారి కామ్రాకు నోటీసులు జారీ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 35 కింద ఈ నోటీసులు జారీ చేశారు.
Supreme Court: అత్యాచారం కేసులో అలహాబాద్ జడ్జి వ్యాఖ్యలు అమానవీయం: సుప్రీంకోర్టు
దీనికి ముందు, మార్చి 25న ఇన్వెస్టిగేటింగ్ అధికారి ముందు హాజరుకావాలంటూ ముంబై పోలీసులు కామ్రాకు నోటీసులిచ్చారు. స్టాండప్ కామెడీ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎంఐడీసీ పోలీసులు తొలుత ఎఫ్ఐఆర్ఐ నమోదు చేసినప్పటికీ తదుపరి విచారణను ఖర్ పోలీసులకు అప్పగించారు.
కునాల్ కామ్రా కామెడీ షోలో ఏక్‌నాథ్ షిండేను పరోక్షంగా 'ద్రోహి' అని అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలను పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, తాను షో నిర్వహించిన హాబిటాట్ కామెడీ క్లబ్‌ను శివసేన నాయకులు విధ్వంసం చేసిన మరో వీడియోను కునాల్ మంగళవారం విడుదల చేశారు. చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా విచారణకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తనను చంపుతామని 500కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు కూడా ఆయన తన సన్నిహితుకు తెలిపారు. ఆ కారణంగానే పోలీసుల ముందు హాజరుకు వారం రోజులు గడువు కోరినట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..