Share News

Cyber Crime: మయన్మార్‌ ‘సైబర్‌’ ముఠాల్లోని 526 మంది భారతీయులకు విముక్తి

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:57 AM

మయన్మార్‌లో సైబర్‌ నేర కేంద్రాలు నిర్వహిస్తోన్న చైనా ముఠాల నుంచి ఇప్పటిదాకా 526మంది భారతీయులను విడిపించామని మయన్మార్‌ పోలీసులు భారత రాయబార కార్యాలయానికి తెలియజేశారు.

Cyber Crime: మయన్మార్‌ ‘సైబర్‌’ ముఠాల్లోని 526 మంది భారతీయులకు విముక్తి

హైదరాబాద్‌,ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మయన్మార్‌లో సైబర్‌ నేర కేంద్రాలు నిర్వహిస్తోన్న చైనా ముఠాల నుంచి ఇప్పటిదాకా 526మంది భారతీయులను విడిపించామని మయన్మార్‌ పోలీసులు భారత రాయబార కార్యాలయానికి తెలియజేశారు. స్వదేశానికి వెళ్లేందుకు ఇష్టపడని భారతీయులు దాదాపు 1500 మంది ఆ ముఠాల్లో ఇంకా ఉన్నారని కూడా పేర్కొన్నారు.


మయన్మార్‌లో రక్షించిన వారిని ప్రస్తుతం థాయ్‌లాండ్‌ సరిహద్దులోని శిబిరానికి తరలించారు. వీరిని అక్కడి నుంచి భారతదేశం పంపించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతోంది. కాగా, ఏపీ, తెలంగాణ చెందిన దాదాపు 30 మంది ఈ శిబిరంలో ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Mar 01 , 2025 | 05:57 AM