Tej Pratap: సీఎం మీ ఎదుటే ఉన్నాడు
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:51 PM
ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ఓవైపు సమావేశానికి సన్నాహకాలు జరుగుతుండగా, లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చర్చనీయాంశంగా మారింది.

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections)కు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) సన్నాహకాలు మొదలుపెట్టింది. కీలకమైన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం శనివారంనాడు ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో అందరి దృష్టి పార్టీ అగ్ర నేతలు తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ పైనే ఉంది. ఓవైపు సమావేశానికి సన్నాహకాలు జరుగుతుండగా, లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ (Tej Pratap) సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చర్చనీయాంశంగా మారింది.
AAP Documentary: ఆప్ డాక్యుమెంటరీ 'అన్‌బ్రేకబుల్'కి బ్రేక్
తేజ్ ప్రతాప్ ఏమన్నారు?
''త్వరలోనే ప్రభుత్వాన్ని మేము గద్దె దింపనున్నాం. తదుపరి ముఖ్యమంత్రి మీ ముందే కూర్చుని ఊన్నాడు'' అంటూ తేజ్ ప్రతాప్ ఆ వీడియోలో చెప్పడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆర్జేడీలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? తేజ్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలు ఏమిటి? అనేవి ఉత్కంఠ రేపుతున్నాయి. ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నేతలు హాజరవుతుండగా, లాలూ ప్రసాద్ తన చిన్నకుమారుడు తేజస్వి యాదవ్‌కు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనికి కొద్ది గంటల ముందే తేజ్ ప్రతాప్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తాజా వీడియో పోస్ట్ చేశారు.
నాయకత్వంపై తేజ్ ప్రతాప్ స్పష్టమైన సందేశాన్ని ఇస్తూ.. ''నాయకత్వం అంటే ఒక పొజిషన్ కాదు, టైటిల్ కాదు. కార్యాచరణ, ఊదాహరణ. కచ్చితంగా ఇలాగే ఉండాలనేది కాదు, ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం. ప్రతిరోజూ మీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంటే ట్రాన్ఫపర్మేషన్ అనేది జరుగుతుంది. మార్పు అలాగే సాధ్యమవుతుంది. కలలు ఎక్కువగా కనండి, ఎక్కువగా తెలుసుకోండి, ఎక్కువగా కృషి చేయడం, మరింత ఎదగండి'' అని తేజ్ ప్రతాప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమయంలో పార్టీ సంస్థాగత ఎన్నికలపై కీలక ప్రకటన ఉంటుందని అంచనా వేస్తు్న్నారు. ప్రస్తుతం మెంబర్‌షిప్ డ్రైవ్ జరుగుతోంది. సభ్యత్వ ఆధారంగా సంస్థాగత ఎన్నికలు ఉంటాయి. 1997లో ఆర్జేడీ ఏర్పడినప్పటి నుంచి ప్రతి మూడేళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తోంది. 2005-2008 సంవత్సరానికి తాజా ఎన్నికలు ప్రకటించాల్సి ఉంది. రాబోయే నాలుగు నెలల్లో పార్టీ పదవులన్నింటికీ ఆర్జేడీ ఎన్నికలు జరపనుంది.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్.. విషయం ఏంటంటే..
Karnataka: కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ
Read Latest National News and Telugu News