Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..
ABN , Publish Date - Jan 30 , 2025 | 08:21 AM
కుంభమేళా 2025 భక్తులతో పోటెత్తుతోంది. ఈ క్రమంలో భక్తుల సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. అయితే నిన్న ఒక్క రోజు ఈ ప్రాంతానికి 7.5 కోట్ల మందికిపైగా వచ్చారు. అయితే మొత్తం ఎంత మంది వచ్చారనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా (Kumbh Mela 2025) జోరుగా కొనసాగుతోంది. అక్కడి ఘాట్‌లు అన్ని భక్తులతో సంతృప్తిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఊహించని స్థాయిలో వస్తున్నారు. ఇప్పటివరకు (జనవరి 29 నాటికి) మొత్తం 27.58 కోట్ల మంది భక్తులు కుంభమేళా స్నానాల్లో పాల్గొన్నారు. జనవరి 29న ఒక్కరోజే 7.5 కోట్ల మందికిపైగా భక్తులు ఘాట్‌లపై హజరయ్యారు. ఈ సంఖ్య కుంభమేళా చరిత్రలోనే సరికొత్త రికార్డ్ అని అధికారులు తెలిపారు. జనవరి 28 నాటికి ఈ సంఖ్య 19.94 కోట్లుగా ఉంది.
ఆధ్యాత్మిక యాత్రగా..
ఈ జాతరకు రావడానికి భక్తులు విదేశాలతోపాటు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది కుంభమేళా కాలంలో కల్పవాసిగా ఉన్నారు. అంటే వారు పలు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలను, పూజలను నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈ భారీ సంఖ్య వారి ఆధ్యాత్మిక చింతన కోసం ప్రయాగ్‌రాజ్ నగరానికి చేరుకున్నట్లు అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కుంభమేళా ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా మారింది.
భద్రతా ఏర్పాట్ల పెంపు..
నిన్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లును మరింత కట్టుదిట్టం చేశారు. వైద్య సేవలు, స్వచ్ఛత, సురక్షిత రవాణా చర్యలు పాటించడంతో భక్తుల రద్దీని జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుతో భక్తులు సులభంగా అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు.
భవిష్యత్తులో మరిన్ని రికార్డులు..
జనవరి 13న ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. యూపీ ప్రభుత్వం ఈసారి మేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది. కానీ ఇప్పటికే దాదాపు 30 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు. ఇక వచ్చే నెలలోని మరో 26 రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
కుంభమేళా మేళా ప్రాముఖ్యత
కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కుంభమేళా ప్రాముఖ్యత కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. సామాజిక, సాంస్కృతిక దృక్కోణం నుంచి కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఉత్సవానికి సాధువులు, ఋషులు, భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. కుంభ స్నాన ప్రాముఖ్యత గురించి హిందూ గ్రంథాలలో వివరంగా ఉంది. కుంభమేళాలో స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి చేసిన అన్ని పాపాలు తొలగిపోయి, మోక్షాన్ని పొందుతాడని భావిస్తారు. దీంతో పాటు కుంభమేళా ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక సామరస్యాన్ని కూడా సూచిస్తుంది.
ఇవి కూడా చదవండి:
MahakumbhStampede: మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం కీలక నిర్ణయం..
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Read More Business News and Latest Telugu News