Pariksha Pe Charcha 2025: ఈసారి విభిన్నంగా పరీక్షా పే చర్చ.. ప్రధాని ఐడియా అదిరింది
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:06 PM
PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తొలగించడానికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన కార్యక్రమమే ‘పరీక్షా పే చర్చ’. విజయవంతంగా 8 ఎడిషన్స్ పూర్తి చేసుకుందీ ప్రోగ్రామ్. త్వరలో ఎగ్జామ్స్ ఉండటంతో ఈసారి సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు మోడీ.

పరీక్షలు అనగానే చాలా మంది పిల్లలు భయపడిపోతారు. ఏడాది మొత్తం చదివినా ఎగ్జామ్స్ అనగానే వణికిపోతారు. పరీక్షలు రాయాలంటే టెన్షన్ పడతారు. అన్ని నెలలు కష్టపడి చదవినా ఒత్తిడి, ఆందోళన, భయం కారణంగా సరిగ్గా రాయలేరు. ఆ తర్వాత మార్కులు తగ్గితే మరింత నిరుత్సాహానికి గురవుతారు. విద్యార్థుల్లోని ఈ భయాన్ని తొలగించి.. పరీక్షలు అంటే ఓ పండుగ, దాన్నో వేడుకలా చూడాలి అంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రతి ఏటా పిల్లల కోసం ‘పరీక్షా పే చర్చ’ అనే కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా 7 ఎడిషన్స్ పూర్తి చేసుకున్న ఈ ప్రోగ్రామ్.. నయా ఎడిషన్‌కు అంతా సిద్ధమవుతోంది. ఈ తరుణంలో మోడీ వినూత్న ఆలోచన చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
వాళ్లనూ ప్రశ్నలు అడగొచ్చు!
విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మిళితం చేస్తూ ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తున్నారు. ఎలా చదవాలి, చదివిన విషయాలను ఎలా ఆకలింపు చేసుకోవాలి, ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎలా రాయాలి లాంటి విషయాలను సోదాహరణతో వివరిస్తూ ప్రధాని మోడీ చేస్తున్న కృషి నిజంగా ప్రశంసనీయం. అయితే ఇన్నాళ్లూ ఈ కార్యక్రమంలో ఆయన ఒక్కరే పాల్గొంటూ వచ్చారు. కానీ ఈసారి కొత్తగా బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకోణ్, విక్రాంత్ మాస్సేతో పాటు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను ‘పరీక్షా పే చర్చ’కు ఆహ్వానించారు.
లిస్ట్ పెద్దదే!
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్, దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కూడా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీళ్లతో పాటు అవనీ లేఖరా, రుజుతా దివేకర్, సోనాలీ సబర్వాల్, రేవంత్ హిమంత్‌సింగ్కా, గౌరవ్ చౌదరి, రాధికా గుప్తా లాంటి ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా అటెండ్ కానున్నారు. జనవరి 10వ తేదీన జరిగే ఈ ప్రోగ్రామ్‌లో నేరుగా కొంతమంది విద్యార్థులు పాల్గొంటారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాది మంది ప్రధానితో కనెక్ట్ అవుతారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు మోడీ సమాధానం చెబుతారు. ఈసారి చాలా మంది సెలెబ్రిటీలు పాల్గొంటుండటంతో విద్యార్థుల క్వశ్చన్స్‌కు వాళ్లు కూడా ఆన్సర్స్ ఇవ్వడంతో పాటు జీవితంలో తాము ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు పంచుకుంటారని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ముస్లింలు, క్రైస్తవుల కొమ్ముకాస్తున్న డీఎంకే
జాగ్రత్త.. ఈ యాప్ మీ మొత్తం సమాచారాన్ని లాగేస్తుంది.. డీప్‌సీప్ వెబ్‌సైట్‌లో రహస్య కోడ్..
అమ్మో ఏం తెలివిరా బాబూ.. ఈ దొంగల చోరీ స్టైల్ తెలిస్తే ...
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి