PM Modi: రామనవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:02 PM
తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. ఆధునిక ఇంజనీరింగ్‌తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్‌తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం.

న్యూఢిల్లీ: ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి (Sri Ram Navami) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించిన కొత్త పంబన్ బ్రిడ్జి (Pamban Bridge)ని ప్రారంభిస్తారు.
Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు: స్పీకర్‌పై రాహుల్ తీవ్ర ఆరోపణ
తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. ఆధునిక ఇంజనీరింగ్‌తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్‌తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం. వేగం, భద్రత, ఆవిష్కరణల కోసం రూపొందించిన బ్రిడ్జి ఇందంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఆ ఫోటోలను విడుదల చేశారు. దేశంలోని ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపానికి ఈ బ్రిడ్జి కలుపుతుందని ఆయన తెలిపారు. ఈ వంతన మధ్యలో భారీ ఓడలు వచ్చినప్పడు తెరుచుకునేలా ప్రత్యేక గేట్లు కూడా ఏర్పాటు చేశారు.
కాగా, కొత్త పంబన్ బ్రిడ్జి ప్రారంభం కాగానే పాత వంతెనపై రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. 2020 ఫిబ్రవరిలో నిర్మాణం ప్రారంభమైంది. కోవిడ్ కారణంగా జాప్యం చోటచేసుని ఏప్రిల్‌లో ప్రారంభానికి ముస్తాబవుతోంది.
ఇవి కూడా చదవండి..