Prashant Kishor: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:57 PM
Prashant Kishor: ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గురువారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
పాట్నా, జనవరి 02: ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రద్దు చేయ్యాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా ఆయన గురువారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బిహార్ ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటేడ్ కంబైన్డ్ కాంపిటేటివ్( ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్ 2024ను బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనను ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది.
అందులోభాగంగా ఆదివారం నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనకారులపై జల ఫిరంగులును ప్రయోగించడంతోపాటు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నిరుద్యోగులపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించడంతో ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. నిరుద్యోగులకు మద్దతుగా జనవరి 2 వ తేదీన తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆదివారం అంటే.. డిసెంబర్ 29వ తేదీన ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
మరోవైపు పాట్నాలోని గాంధీ మైదానంలో విద్యార్థులను నిరసన చేసేందుకు ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌తోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు
ఇక ఆదివారం రాత్రి పోలీసులు నిరుద్యోగులపై లాఠీఛార్జి చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిశోర్ అక్కడి నుంచి వెళ్లి పోతున్న వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అటు విద్యార్థులకు, ఇటు ప్రశాంత్ కిషోర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమపై పోలీసులు లాఠీఛార్జి చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోయారంటూ ప్రశాంత్ కిషోర్‌ని నిరుద్యోగులు సూటిగా ప్రశ్నించారు.
Also Read: లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం నితీష్ కుమార్
ఆ క్రమంలో నిరసన ప్రాంతం నుంచి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రశాంత్ కిశోర్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వారు నినాదాలు చేపట్టారు. అయితే అభ్యర్థుల ఆరోపణలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. వారి ఆరోపణలను ఆయన ఖండించారు. నిరుద్యోగుల ఉద్యమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే పోలీసులు లాఠీఛార్జి చేస్తుండడంతో విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లాలని సూచిస్తూ.. తాను మరో ప్రదేశానికి వెళ్లానని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. అదీకాక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.
Also Read: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ
For National News And Telugu News