Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:28 PM
సమాజం ఎందుకు విడిపోయి ఉంది? ఆలయం లేకుండా సుదీర్ఘం కాలం రాముడు, మన దేవుళ్లు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అనేది ప్రజలు ఆలోచించాలని ఆదిత్యనాథ్ కోరారు.
అయోధ్య: అయోధ్యలో రామమందిర తొలి వార్షికోత్సవం కన్నులపండువగా శనివారం మొదలైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఈ వేడుకలను ప్రారంభించారు. ప్రజలందరికీ రామాలయ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ''రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు'' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదాన్ని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. 2014 నుంచి అయోధ్య నగరాభివృద్ధిని హైలైట్ చేస్తూ, ప్రవాహంలా భక్తులు, యాత్రికులు తరలివస్తుండటం వేడుకల వైభవాన్ని పెంచుతోందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ యోగి చెప్పారు.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఆధ్యాత్మికంతోపాటు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా..
''అయోధ్యకు ప్రతిరోజు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారు. 2014కు ముందు అయోధ్యలో కరెంటు కూడా లేదు. పారిశుద్ధ్యం ప్రసక్తే లేదు. అయోధ్యలో విమానాశ్రయంలో లేదు. ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. నాలుగు లేన్లు, ఆరు లేన్ల రోడ్ల నిర్మాణం జరిగింది. సరయూ నదీ ఘాట్‌లు యావద్దేశంలోని టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి'' అని యోగి అన్నారు.
సమాజం ఎందుకు డివైడ్ అయింది? రాముడికి ఆ పరిస్థితి ఏంటి?
సమాజం ఎందుకు విడిపోయి ఉంది? ఆలయం లేకుండా సుదీర్ఘం కాలం రాముడు, మన దేవుళ్లు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అనేది ప్రజలు ఆలోచించాలని ఆదిత్యనాథ్ కోరారు. ప్రజలు ఐక్యంగా ఉండాలని, కులం పేరుతో విడిపోరాదని సూచించారు. "మనమంతా కలిసి ఉంటేనే, సనాతన ధర్మం బలంగా ఉంటుంది. మన దేశం పటిష్టంగా నిలుస్తుంది'' అని యోగి అన్నారు. కులం పేరుతో విడిపోతో మన దేవుళ్లకీ ఇదే పరిస్థితి ఎదురవుతుందని, మన అక్కచెల్లెళ్లుకు ఇబ్బందులు ఏర్పడతాయని హితవు పలికారు. కాగా, దీనికి ముందు యోగి ఆదిత్యనాథ్ రామజన్మభూమికి చేరుకుని రామాలయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 'ప్రాణ్ ప్రతిష్ఠ ద్వాదశి' ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు అయోధ్యలో ప్రత్యేక సాంస్కృతిక, రెలిజియస్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇవి కూాడా చదవండి..
Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్’..
Biscuits: అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్లు
Read Latest National News and Telugu News