Share News

Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్

ABN , Publish Date - Feb 15 , 2025 | 09:52 PM

తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, తనను చంపుతామని, తన కుటుంబాన్ని అవమానంపాలు చేస్తామని బెదరింపులు వస్తున్నాయని యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా ఆందోళన వ్యక్తం చేశారు.

Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్

న్యూఢిల్లీ: 'ఇండియాస్ గాట్ లాటెండ్' షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ‌రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) తాజాగా ఒక పోస్ట్‌లో తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తానెక్కడికీ పారిపోవడం లేదని, పోలీసులకు తాను సహకరిస్తానని అన్నారు.

Ranveer Allahbadia: రణ్‌వీర్ తరఫున వాదిస్తున్న లాయర్ ఎవరో తెలుసా?


రణ్‌వీర్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండటం, అతని కోసం ముంబై పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా పోస్ట్‌ పెట్టారు. ''నేను, నా టీమ్ టీమ్ మొత్తం పోలీసులకు, ఇతర అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని ఏజెన్సీలకు అందుబాటులో ఉంటాం. తల్లితండ్రుల మీద నేను చేసిన వ్యాఖ్యలు అగౌరవపరచేలా ఉన్నాయని అంగీకరిస్తున్నాను. మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను'' అని రణ్‌వీర్ పేర్కొన్నారు. తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, తనను చంపుతామని, తన కుటుంబాన్ని అవమానంపాలు చేస్తామని బెదరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేషెంట్ల పేరుతో తన తల్లి క్లినిక్‌కు వచ్చి ఆమెను కొందరు బెదిరించినట్టు చెప్పారు. అసలు ఏం జరుగుతోందో తెలియని భయాందోళనలో ఉన్నట్టు చెప్పారు. తాను పారిపోయేది లేదని, పోలీసులు, న్యాయవ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు.


జరిగిందిదే...

సమయ్ రైనా 'ఇండియాస్ గాట్ లాటెండ్' షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారంపై రణ్‌వీర్ ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై వివిధ రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అయితే వెంటనే ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర ఖార్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఇదే సమయంలో తనపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఒకేచోట క్లబ్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును రణ్‌వీర్ ఆశ్రయించారు.


ఇవి కూడా చదవండి...

US Deportation Flights: భారత్‌కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..

Special Vande Bharat Train: నేటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 09:54 PM