RSS: మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: హోసబలె
ABN , Publish Date - Mar 23 , 2025 | 09:56 PM
ముస్లింలకు 2B కేటగిరి కింద 4 శాతx రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై అడిగిన ఒక ప్రశ్నకు దత్తాత్రేయ హోసబలె సమాధానమిస్తూ, ఇదే తరహా ప్రయత్నాలు గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరిగినప్పటికీ సంబంధించి హైకోర్టులు కొట్టేశాయని చెప్పారు.

బెంగళూరు: మత ఆధారిత రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, భారత రాజ్యాంగం కూడా ఇందుకు ఎలాంటి వెసులుబాటు కల్పించలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె (Dattatreya Hosabale) అన్నారు. ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపు సందర్భంగా ఆదివారంనాడడిక్కకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, మత ఆధారిత రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పారు.
Prashant Kishor: ఆయన శారీరకంగా అలసిపోయారు, మానసిక స్థిమితం కోల్పాయారు
ముస్లింలకు 2B కేటగిరి కింద 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఇదే తరహా ప్రయత్నాలు గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరిగినప్పటికీ సంబంధించి హైకోర్టులు కొట్టేశాయని చెప్పారు.
దారా షికోని కాకుండా జౌరంగబేబుని ఆరాధిస్తున్నారు
మహారాష్ట్రలోని ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ చేస్తు్న్న డిమాండ్‌పై అడిగినప్పుడు, ఔరంగబేబును కీర్తించే వారు భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. సామాజిక సామరస్యాన్ని విశ్వసించే ఔరంగజేబు సోదురుడు దారా షికోను కాకుండా దేశ నైతికతకు వ్యతిరేకమైన ఔరంగబేబుని ఒక ఐకాన్‌ను చేశారని విమర్శించారు. ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్నవారు భారతదేశానికి ముప్పు అని వ్యాఖ్యానించారు. గంగా-జముని సంస్కృతిని సమర్ధించే వారు దారా షికోను ముందుకు తీసుకురావాలని ఎప్పుడూ అనుకోలేదని తప్పుపట్టారు. మహారాణ ప్రతాప్ కోసం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారని, అదికూడా స్వాతంత్ర పోరాటమేనని చెప్పారు. మన దేశ నైతికతకు ఎవరు సరిపోతారో మననే నిర్ణయించుకోవాలని, ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్న వ్యక్తులు దేశానికి ముప్పు అని అన్నారు.
ఇవి కూడా చదవండి..