Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
ABN , Publish Date - Jan 17 , 2025 | 02:44 PM
Saif Ali Khan Case: స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ అటాక్‌పై సైఫ్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తున్న లీలావతి ఆస్పత్రి వైద్యులు స్పందించారు. హెల్త్ అప్‌డేట్ ఇస్తూనే ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడితో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అతడిపై ఓ దుండగుడు కత్తితో దాడికి తెగబడటం సంచలనంగా మారింది. బాంద్రాలో సంపన్నులు ఉండే ఏరియాలో అంత సెక్యూరిటీ మధ్య సైఫ్ ఇంట్లోకి దుండగులు ఎలా వచ్చాడు? అంత క్రూరంగా ఎలా దాడి చేశాడు? అనే ప్రశ్నలు అందరి మదిని తొలుస్తున్నాయి. ఈ కేసులో నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతడ్ని విచారిస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో సైఫ్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన డాక్టర్లు.. దాడిపై సంచలన విషయాలు బయటపెట్టారు. అదే జరిగితే ఆయన బతికేవాడు కాదన్నారు.
కొద్దిలో సేఫ్!
‘ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన వేగంగా కోలుకుంటున్నారు. సైఫ్ మెళ్లిగా నడుస్తున్నారు. భయపడాల్సిందేమీ పనిలేదు. పెరాలసిస్ రిస్క్ కూడా లేదు. ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు షిఫ్ట్ చేశాం. అయితే వారం వరకు ఆయన్ను విజిటర్స్ కలవడానికి లేదు. వెన్ను గాయం కారణంగా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎవర్నీ అనుమతించడం లేదు. ఆయన హాస్పిటల్‌లోకి వచ్చినప్పుడు రక్తంతో తడిసిపోయి ఉన్నారు. అయినా సింహంలా నడుచుకుంటూ వచ్చారు. స్ట్రెచర్ కూడా వాడలేదు. ఆయన రియల్ హీరో. సైఫ్ అదృష్టవంతుడు. ఆయన వెన్నులోకి దిగిన కత్తి మరో 2 మిల్లీమీటర్లు లోపలకు వెళ్లి ఉంటే ప్రాణానికే ప్రమాదం వచ్చేది’ అని సైఫ్‌కు చికిత్స అందిస్తున్న లీలావతి హాస్పిటల్ డాక్టర్ నితిన్ నారాయణ్ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి
ఏఐ కంటెంట్‌పై లేబుల్స్ తప్పనిసరి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి