Farmer Leaders Arrest: సరిహద్దు పాయింట్ల వద్ద ఉద్రికత.. రైతు నేతల అరెస్టు
ABN , Publish Date - Mar 19 , 2025 | 08:49 PM
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో రైతులు ప్రదర్శన జరుపుతున్న రెండు కీలక ప్రాంతాల నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు రైతు నేతలు తెలిపారు. రైతులు తమ గమ్య స్థానాలకు చేరకుండా అడ్డుకునేందుకు పెద్దఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.

మొహాలి: శంభు, కనౌరి సరిహద్దుల్లో తిరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి నిరసన ప్రాంతాలకు వెళ్తుండగా రైతు నేతలను పంజాబ్ పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. దీంతో రైతు నేతలు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సర్వన్ సింగ్ పంథేర్, జగ్జిత్ సింగ్ దలేవాల్, అభిమన్యు కోహర్, కాకా సంగ్ కోట్ర, మంజిత్ సింగ్ రాయ్ సహా పలువురు రైతు నేతలను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసినట్టు రైతు నేత ఒకరు తెలిపారు. ఛండీగఢ్‌లో కేంద్ర ప్రతినిధి బృందంతో చర్చలు అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంలో రైతు నేతలు తిరిగి నిరసన ప్రాంతాలకు వెళ్తుండగా ఈ అరెస్టులు చేసినట్టు చెప్పారు.
RSS: ఇప్పటి తరానికి ఆ అవసరం లేదు.. ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు
భారీగా పోలీసు బలగాల మోహరింపు
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో రైతులు ప్రదర్శన జరుపుతున్న రెండు కీలక ప్రాంతాల నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు రైతు నేతలు తెలిపారు. రైతులు తమ గమ్య స్థానాలకు చేరకుండా అడ్డుకునేందుకు పెద్దఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. అదనంగా అంబులెన్సులు, బస్సులు అగ్నిమాక శకటాలను నిరసన ప్రదర్శనా స్థలాల వద్ద నిలిపి ఉంటారు.
కేంద్రంతో అసంపూర్తిగా చర్చలు
కాగా, బుధవారంనాడు ఛండీగఢ్‌లోని కేంద్ర ప్రతినిధులు, రైతు ప్రతినిధుల మధ్య తాజా రౌండ్ చర్చలు జరిగాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, చర్చలు కొనసాగుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. రైతు ప్రతినిధులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, మే 4న తదుపరి చర్చలు జరుపుతామని చెప్పారు. గత ఫిబ్రవరి నుంచి పలు డిమాండ్లపై సంయుక్త కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో పరిస్థితి విషమించకుండా సరిహద్దు పాయింట్ల వద్ద వివిధ జిల్లాలకు చెందిన పోలీసు బలగాలను మోహరించారు.
ఇవి కూడా చదవండి
Aurangzeb tomb row: ఒసామాబిన్ లాడెన్ ప్రస్తావన చేసిన ఏక్‌నాథ్ షిండే
PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..
Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి