Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:46 PM
Ranya Rao: కన్నడ నటి రన్యారావు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నటుడు తరుణ్ రాజ్ కొండూరుతో ఆమె దుబాయి కేంద్రంగా ఈ స్కాం నడిపినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.

బెంగళూరు: దుబాయి నుంచి భారత్‌కు అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టబడిన కన్నడ నటి రన్యారావు కేసులో రోజుకోక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఎపిసోడ్‌లో బయటపడుతున్న విషయాల చూసి అంతా విస్తుపోతున్నారు. అసలు రన్యారావు సినిమాలు విడిచి దుబాయికు ఎందుకు వెళ్లింది. ఆమె వెనుక ఎవరున్నారు. యాక్టర్ నుంచి గోల్డ్ స్మగ్లర్‌గా ఎలా మారారు. ఒక ఏడాదిలో 30సార్లు దుబాయి ఎందుకు వెళ్లారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రన్యారావుకు తరుణ్ రాజ్ సహకారం
దుబాయ్ కేంద్రంగా రన్యారావు గోల్డ్ స్కాం దందా నడిపించింది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి దుబాయ్‌కు వెళ్లింది. గోల్డ్ స్మగ్లింగ్‌లో డాన్‌గా వెలగాలని ఆమె వేసిన ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది. ఈ క్రమంలో ఆమెకు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అనే నూతన నటుడు పేరు కూడా ఈ స్కాంలో ప్రధానంగా వినిపిస్తోంది. ‘పరిచయం’ అనే సినిమాతో తరుణ్ రాజ్ టాలీవుడ్‌కు ఇంటర్ డ్యూస్ అయ్యాడు. గోల్డ్ స్మగ్లింగ్‌లో తరుణ్ రాజ్‌కు కూడా రన్యారావు భారీగా షేర్ అప్పగించినట్లు సమాచారం. రన్యారావుతో తరుణ్ రాజ్‌కు 2019 నుంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.డీఆర్ఐ అధికారుల విచారణలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అప్పటి నుంచి రన్యారావుతో ఉన్న పరిచయం కాస్తా.. గోల్డ్ స్మగ్లింగ్‌కు దారి తీసింది. అతడి సహాకారంతో ఈ దందాను రన్యారావు నడిపించినట్లు తెలుస్తోంది. బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు సంపాదించడానికి వ్యూహం రచించిన రన్యారావు... కొంతమంది అధికారుల అండతో భారీగా సంపాదించింది. అయితే ఆమెపై అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు కూపీ లాగడంతో ఈ దందా వెలుగుచూసింది. ఈ దందా బయటపడటంతో ఆమె ఇప్పుడు జైలు పాలయింది. చాలాకాలంగా ఈ దందాను రన్యారావు కొనసాగించింది.
రన్యారావును ఎలా కనిపెట్టారంటే...
అధికారులకు దొరకకుండా ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తూ తన అక్రమ వ్యాపారాన్ని నడిపించింది. ఎవరైనా బంగారాన్ని అక్రమంగా తరలించాలంటే చాలా పథకాలు రచిస్తుంటారు. కానీ రన్యారావుకు ఇలాంటివేమి అవసరం లేకుండా సునాయాసంగా బంగారాన్ని దేశాలు దాటించింది. పైకి చూడటానికి సాధారణ మనిషిలా కనిపించే రన్యారావును మొత్తానికి అధికారులు కనిపెట్టేశారు. ఆమెను ఎయిర్‌పోర్టులో అధికారులు స్కాన్ చేసేవరకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించలేకపోయారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి, చేకింగ్ పాయింట్లను దాటుకుని గోల్డ్‌ను ఎలా బయటకు తీసుకువెళ్లిందనేది డీఆర్ఐ అధికారులకు ప్రశ్నార్థకంగా ఉంది. రన్యారావు కేసు పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ఈ దందా వెనుక ఎవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఆమె వెనుక ఎన్నో రహాస్యాలు దాగి ఉన్నాయి. ఈ కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఓ వ్యక్తి అండతో..
సాధారణంగా దుబాయి నుంచి ప్రతిరోజు చాలామంది కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తీసుకువస్తుంటారు. ప్రస్తుతం సాంకేతికత బాగా అభివృద్ధి చెందడంతో చాలామంది తనిఖీల్లో దొరికేస్తున్నారు. కానీ రన్యారావు మాత్రం పదుల సార్లు బంగారాన్ని అక్రమంగా తరలించినా అధికారులకు దొరకలేదంటే ఆమెకు విమానాశ్రయంలోని అధికారులు లేదా కస్టమ్స్ విభాగానికి చెందిన ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుబాయిలో బంగారు దుకాణాన్ని ప్రారంభించిన రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్‌పై దృష్టిసారించింది. ఎట్టకేలకు అధికారులకు చిక్కడంతో ప్రస్తుతం ఊసలు లెక్కిస్తోంది. రన్యారావు ఎపిసోడ్‌లో మున్ముందు ఎలాంటి ట్విస్టులు నెలకొంటాయో వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..
Read Latest NATIONAL News And Telugu News