Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఆధ్యాత్మికంతోపాటు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా..
ABN , Publish Date - Jan 11 , 2025 | 03:33 PM
జనవరి 13న మకర సంక్రాంతి నుంచి ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మొదలయ్యే మహాకుంభమేళాకు చాలా ప్రాముఖ్యత ఉందని ప్రముఖ ధ్యాన గురువు రఘునాథ్ గురూజీ తెలిపారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభ్ గురించి ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ (uttar pradesh) ప్రయాగ్ రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ప్రాముఖ్యత గురించి అనేక గ్రంథాలు, ఇతిహాసాలలో కూడా ఉందని ప్రసిద్ధ ధ్యాన గురువు రఘునాథ్ గురూజీ అన్నారు. 'ఆధ్యాత్మికతలో శాస్త్ర శోధన' అనే సిరీస్‌లో ఈ మేరకు వెల్లడించారు. ఇది భారతీయ తత్వశాస్త్రం, విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందాయో రుజువు చేస్తుందని చెప్పారు. వేల సంవత్సరాల క్రితం మన భారతీయ తత్వశాస్త్రం, విజ్ఞానం ఎంత ఆధునికంగా ఉండేవో.. మన పూర్వీకులు ఎంత ప్రగతిశీలంగా, చైతన్యవంతంగా, జ్ఞానవంతంగా ఉన్నారో తెలిపారు.
అమృత కలశం
ఈ క్రమంలో మహా కుంభమేళాకు మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మాత్రమే కాకుండా శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉందని ధ్యానగురు రఘునాథ్ గురూజీ వివరించారు. మన ఋషులు, సాధువులు చాలా విద్యావంతులని, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నారని చెప్పారు. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సముద్ర మథనం నుంచి అమృత కలశం ఉద్భవించిందని నమ్ముతున్నట్లు చెప్పారు. దీనిని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగిందని, అదే సమయంలో, నాలుగు చుక్కల అమృతం భూమిపై పడిందని అవే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రదేశాలుగా ఉద్భవించాయని అన్నారు.
ప్రత్యేక యాదృచ్చికం
దేవతలు 12 రోజులు.. భూమి 12 సంవత్సరాలకు సమానమని రఘునాథ్ గురూజీ అన్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు, బృహస్పతి అనే నాలుగు గ్రహాలు ఒక ప్రత్యేక సంయోగంలో వచ్చినప్పుడు, జనవరి 3న సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. దీనితో పాటు, 14వ తేదీన, మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి చేరతాడు. ఒక ప్రత్యేక యాదృచ్చికం కారణంగా పౌష పూర్ణిమ రోజున బృహస్పతి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
పౌర్ణమి నాడు బృహస్పతి కుంభ రాశిలోకి వస్తారని చెప్పాడు.ఈ క్రమంలో సూర్యుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సౌరచక్రాన్ని పూర్తి చేస్తాడు. సూర్యుడు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి తిరిగేటప్పుడు, భూమి వాతావరణం సూర్యుని అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రభావితమవుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం భూమిపై నివసించే జీవులు, మానవులకు అపారమైన సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.
సౌరచక్రం కారణంగా..
సౌరచక్ర సమయం కూడా కుంభ రాశితో ముడిపడి ఉందని రఘునాథ్ గురూజీ వివరించారు. వాతావరణంలో ఆక్సిజన్ అణువుల సాంద్రత ఎక్కువగా ఉండే చల్లని రోజులు ఉంటాయన్నారు. ఆ సమయంలో వాతావరణం, నీటిలోనూ ఆక్సిజన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సిజన్ అణువులు పవిత్ర గంగా నది, యమునా నది, సరస్వతి నది సంగమం వద్ద కలిసినప్పుడు, నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. ఈ శాస్త్రీయ కారణాన్ని దృష్టిలో ఉంచుకుని మన ఋషులు కుంభమేళా సంప్రదాయాన్ని అభివృద్ధి చేసి ఉంటారని భావిస్తున్నట్లు స్వామిజీ వెల్లడించారు.
శాంతితోపాటు..
బృహస్పతి గురుత్వాకర్షణ శక్తి, సూర్యుని సౌర చక్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం సౌర బిందువు మార్పు సమయంలో అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయని రఘునాథ్ గురూజీ అన్నారు. ఇది భూమిపై సానుకూల శక్తిని సృష్టించి ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ ద్వారా మానవ మెదడులోని ఆల్ఫా కిరణాలను పెంచుతుందన్నారు. ఇది ఆయా వ్యక్తుల మనస్సుకు శాంతిని ఇస్తుందని, శరీరానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుందన్నారు.
భూమి, సూర్యుడు, చంద్రుడు
సూర్యుని కార్యకలాపాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయని, ఇది నిద్ర, మేల్కొలుపు చక్రం అని పిలువబడే మానవ జీవ గడియారాన్ని మెరుగుపరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భూమి, సూర్యుడు, చంద్రుడు, గురువుల ఖగోళ సంయోగం వాతావరణంలో సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుందని రఘునాథ్ గురూజీ వివరించారు. ఈ శక్తితో పాటు అన్ని దేవతల ఆశీస్సులు, సాధువులు, సన్యాసుల కారణంగా వాతావరణం ప్రభావితం అవుతుందని వెల్లడించారు. ఇది మన జీవితాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Narendra Modi: చెడు ఉద్దేశంతో అలా చేయను.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Read More Business News and Latest Telugu News