Tomato: కడుపుకోత.. పశువులకు మేత
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:39 PM
రెండు నెలల క్రితం కిలో రూ.50..60 పలికిన టమోటా(Tomato) ధర... అమాంతం పడిపోవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన టమోటాకు మార్కెట్లో ధర లేకపోవడంతో ఇంటికి తీసుకెళ్ళలేక చెత్తకుప్పలో పడేసిన దృశ్యం బళ్ళారి ఏపీఎంసి మార్కెట్(Bellary APMC Market)లో గురువారం చోటు చేసుకుంది.
బళ్లారి(బెంగళూరు): రెండు నెలల క్రితం కిలో రూ.50..60 పలికిన టమోటా(Tomato) ధర... అమాంతం పడిపోవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన టమోటాకు మార్కెట్లో ధర లేకపోవడంతో ఇంటికి తీసుకెళ్ళలేక చెత్తకుప్పలో పడేసిన దృశ్యం బళ్ళారి ఏపీఎంసి మార్కెట్(Bellary APMC Market)లో గురువారం చోటు చేసుకుంది.
ఈ వార్తను కూడా చదవండి: Actress Khushboo: నటి ఖుష్బూ అరెస్ట్.. విషయం ఏంటంటే..
బళ్లారి(Ballary) చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు పొరుగున్న ఉన్న అనంతపురం(Anantapur) జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో టమోటా పంట భారీగా సాగు చేయడంతో టమోటా భారీగా బళ్ళారి ఏపీఎంసీకి చేరుకుంటోంది. 20కిలోల బాక్సు టమోటా ధర గత నెల రూ 400 నుంచి రూ 500 పలుకగా నేడు బాక్సు ధర రూ.50కు పడిపోయింది. దీంతో కనీసం పెట్టుబడి కూడా చేతికి రాదని టమోటా రైతు కన్నీరు పెడుతున్నారు. చెత్తకుప్పలో పడేసిన టమోటా పశువులకు మేతగా మారిన దృశ్యాలు కనిపించాయి.
ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట
ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Read Latest Telangana News and National News