Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి
ABN , Publish Date - Jan 13 , 2025 | 02:37 PM
సంతోషంగా ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్తున్న యాత్రికులకు ఒక్కసారిగా భయాందోళన చుట్టుముట్టింది. వారు వెళ్తున్న ట్రైన్‌పై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై అప్రమత్తమైన రైల్వే అధికారులు ఎవరు ఈ పని చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే తపతి గంగా ఎక్స్‌ప్రెస్ గుజరాత్ సూరత్ నుంచి బీహార్‌లోని చాప్రా నగరానికి వెళుతోంది. ఆ క్రమంలో రైలులో 55 శాతం మంది ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్ మహాకుంభానికి వెళ్తున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే 2-3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రాళ్ల దాడి జరిగిందని చెబుతున్నారు.
పగిలిన అద్దం..
ఈ ఘటనపై సమచారం తెలుసుకున్న అధికారులు రాళ్ల దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ రైలు బీ6 కోచ్ కిటికీ అద్దం పగిలిపోయింది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌లో కూడా ఆగుతుందని, ఈ రైలులో కుంభమేళా (ప్రయాగ్‌రాజ్ కుంభ్ 2025)కి వెళ్లే ప్రయాణికులు చాలా ఉన్నారని పోలీసులు అన్నారు. రైలుకు జరిగిన నష్టం గురించి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భద్రత గురించి
ఈ ఘటన నేపథ్యంలో కుంభమేళాకు వెళ్లే చాలా మంది ప్రయాణికులు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైళ్లకు మెరుగైన భద్రత కల్పించాలని రైల్వే అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఆ రైల్వే కోచ్‍లో మహిళలు, పిల్లలు, భక్తులు సహా 13 మంది ఉన్నారు. రైలులో దాదాపు 55 శాతం మంది మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. ఈ విషయంపై సెంట్రల్ రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే రక్షణ పోలీసులు ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుని నాలుగు బృందాలను ఆ ప్రాంతాల్లో మోహరించారు. ఈ విషయంలో ఫిర్యాదు కూడా దాఖలైంది.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటన తర్వాత జల్గావ్ రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుంభమేళాకు వెళ్లే యాత్రికులకు ఏర్పాటు చేసిన రైళ్లలో తపతి గంగా ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఇలాంటి దాడి నేపథ్యంలో రైలు మార్గంలో అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తామని అధికారులు ప్రయాణికులకు హామీ ఇచ్చారు. జనవరి 13న ఉదయం ప్రయాగ్‌రాజ్ నుంచి రైలు బయలుదేరింది. రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News