CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:57 PM
తమిళనాడులో 39 పార్లమెంటరీ నియోజకవర్గాలుండగా, నియోజకవర్గాల పునర్విభన పేరుతో సీట్లు తగ్గడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

చెన్నై: తమిళనాడులో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందున పార్లమెంటరీ సీట్లు తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆందోళన వ్యక్తం చేశారు. కొలతూర్‌లో పార్టీ సీనియర్ కార్యకర్త పెళ్లి కార్యక్రమంలో సీఎం ఆదివారంనాడు పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ విధానాన్ని సక్రమంగా పాటిస్తున్నందున నియోజకవర్గ పునర్విభజనలో పార్లమెంటరీ సీట్లు తగ్గే పరిస్థితి ఏర్పడిందన్నారు.
Shashi Tharoor: కాంగ్రెస్‌తో విభేదాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళనాడులో 39 పార్లమెంటరీ నియోజకవర్గాలుండగా, నియోజకవర్గాల పునర్విభన పేరుతో సీట్లు తగ్గడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
మరింత మంది పిల్లల్ని కనండి
నియోజవర్గాల పునర్విభజన ప్రక్రియపై గత ఏడాది అక్టోబర్‌లో స్టాలిన్ మాట్లాడుతూ, ఎక్కువ మంది పిల్లల్ని కనాలను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "ఈరోజుల్లో 16 రకాల సంపద కలగాలని మనం ఎవర్నీ ఆశీర్వదించనక్కరలేదు. చిన్నకుటుంబంతో బతకమని అనందంగా జీవించమని మాత్రమే ఆశీర్వదిస్తున్నాం. అయితే పార్లమెంటరీ సీట్లు తగ్గే పరిస్థితి తలెత్తినప్పుడు మనకు చిన్న కుటుంబాలు ఎందుకని ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. 2023లోనూ డీలిమిటేషన్ ప్రక్రియను 'రాబోయే విపత్తు'గా స్టాలిన్ పేర్కొన్నారు. ఇందువల్ల పార్లమెంటలో తమ ప్రాతినిధ్య తగ్గుతుందనే భయం దక్షిణాది రాష్ట్రాల్లో ఉందని, ఆ భయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలగించాలని కోరారు. జనాభా వృద్ధిని నియంత్రించాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను హుందాగా అనుసరిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ కారణంగా శిక్షకు గురికావడం అన్యాయమని అన్నారు.
''జనాభా ఆధారంగా ఎంపీల సంఖ్య పెంచడం, దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించడమనే రాజకీయ కుట్రను మనం ఓడించాలి. రాజకీయ చైతన్యం కలిగిన తమిళనాడు ఈ వైపరీత్యాన్ని మొగ్గలోనే తుంచివేయాలి. జనాభా ప్రాతిపదికగా డీలిమిటేషన్ ప్రక్రియతో ఎంపీల ప్రాతినిధ్యం తగ్గకుండా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడుకు ప్రధాని భరోసా ఇవ్వాలి'' అని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
PM Modi Mann ki Baat: మన్ కీ బాత్.. ఇస్రోకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ..
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.