Share News

Jallikattu: రంకేసిన తొలి జల్లికట్టు..

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:57 PM

రాష్ట్రంలో సంప్రదాయ, సాహస జల్లికట్టు(Jallikattu) పోటీలను శనివారం పుదుకోట జిల్లా తచ్చంకుర్చిలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్‌.రఘుపతి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వి.మెయ్యనాథన్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Jallikattu: రంకేసిన తొలి జల్లికట్టు..

- తచ్చంకుర్చిలో కోలాహలం

చెన్నై: రాష్ట్రంలో సంప్రదాయ, సాహస జల్లికట్టు(Jallikattu) పోటీలను శనివారం పుదుకోట జిల్లా తచ్చంకుర్చిలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్‌.రఘుపతి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వి.మెయ్యనాథన్‌ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ఎం.అరుణ నేతృత్వంలో ఎద్దులను నిలువరించేందుకు గుర్తింపుకార్డులు కలిగిన వీరులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటలకు వాడివాసల్‌ మీదుగా తచ్చంకురిచ్చి ఆలయ ఎద్దు మైదానంలో రంకెలేస్తూ పరుగులు తీసింది.

ఈ వార్తను కూడా చదవండి: Anna University: అత్యాచారం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు


ఈ ఏడాదిలో రాష్ట్రంలో నిర్వహించిన తొలి జల్లికట్టు కార్యక్రమం ఇదే కావడంతో రాష్ట్రం నలు మూలల నుంచే కాకుండా, స్వదేశీ, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం సహకరించడంతో పాటు అనుమతిని జారీ చేసింది. పుదుకోట(Pudukota) జిల్లాలో అత్యధిక సంఖ్యలో జల్లికట్టు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఎద్దుల బండ్ల పోటీల ప్రధాన పండుగ సీజన్‌లో ఏర్పాటు చేస్తారు.


nani3.2.jpg

ఈ నేపథ్యంలో శనివారం తచ్చంకుర్చిలో నిర్వహించిన జల్లికట్టులో తిరుచ్చి, దిండుగళ్‌, శివగంగ, మనప్పారై, పుదుకోట జిల్లాల నుంచి 600పైగా ఎద్దులు పాల్గొన్నాయి. సుమారు 320 మందికి పైగా యువకులు రంకెలేస్తూ పరుగులు తీసిన ఎద్దులను నిలువరించేందుకు పోటీ పడ్డారు. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పశు సంవర్థక శాఖ వైద్యులు ముందుగానే జల్లికట్టు ఎద్దులు, యువకులకు వైద్యపరీక్షలు నిర్వహించి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.


ఇదిలా ఉండగా గాయపడిన యువకులను, ప్రజలను వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. అలాగే ప్రథమ చికిత్సలను అందించారు. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు తదితర శాఖల అధికారులు కలిసి కట్టుగా ఈ పోటీలు నిర్వహించేందుకు సహకరించారని జల్లికట్టు నిర్వాహకులు తెలిపారు. పలు రౌండ్లుగా సాగిన ఈ పోటీలో విజేతలకు, ఎవరికి పట్టుబడిన ఎద్దుల యజమానులకు విలువైన బహుమతులు పంపిణీ చేసి అభినందించారు.


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 01:57 PM