Share News

Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:33 PM

మీరు ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా కోసం వెళ్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే మీరు మాత్రం ఈ ప్రాంతాల్లో ప్రయాణించకండి. పలు చోట్ల మాత్రం భారీగా ట్రాఫిక్ ఉంటుంది. దీనిని అధిగమించడానికి ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Traffic Updates at Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్‌(prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela 2025)కు రోజురోజుకు లక్షలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని అనేక చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రధానంగా జబల్‌పూర్-కట్ని-సియోని వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాగ్‌రాజ్ చేరుకునేందుకు అనేక మంది భక్తులకు ఎక్కువ సమయం పడుతుంది. పలు నివేదికల ప్రకారం 500 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్‌ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది చరిత్రలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్‌లలో ఒకటని చెబుతున్నారు.


ముందుగా తెలుసుకుని

అయితే ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా సందర్శన కోసం వెళ్ళే వారు ఈ ట్రాఫిక్ పరిస్థితులను ముందుగా తెలుసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, రహదారి మూసివేత మార్గాల గురించి రియల్ టైమ్ అప్‌డేట్‌లు తెలుసుకోవడం ద్వారా మీరు సులభంగా మీ గమ్యానికి చేరుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ఈ విషయంలో మీకు కీలక సమాచారాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నాయి. అయితే ఎలా చెబుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


రియల్ టైమ్ అప్‌డేట్‌

ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ Android, iOS పరికరాల్లో అందుబాటులో ఉంది. ఇది రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా మీరు రోడ్లలో రద్దీని గమనించి, వేగవంతమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ యాప్ ట్రాఫిక్ పరిస్థితిని రంగు కోడెడ్ సిస్టమ్ ద్వారా మీకు అందిస్తుంది.

  • ఆయా ప్రాంతాల్లో ఎరుపు ఉంటే భారీ ట్రాఫిక్ ఉందని అర్థం. ఈ ప్రాంతాల్లో మీ ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు.

  • మీకు పసుపు రంగు కనిపిస్తే, ఆయా చోట్ల రద్దీ కాస్తా తక్కువగా ఉందని చెప్పవచ్చు.

  • ఆయా ప్రాంతాల్లో మీకు గ్రీన్ రంగు కనిపిస్తే మీరు సాఫీగా రోడ్లపై ప్రయాణించవచ్చు. ఈ మార్గం మీకు సులభ ప్రయాణాన్ని అందిస్తుంది.


ఇలా చెక్ చేసుకోండి..

గూగుల్ మ్యాప్స్‌తో మీ ట్రాఫిక్‌ను ఇలా నావిగేట్ చేసుకోండి. ఈ క్రమంలో మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఖచ్చితమైన ట్రాఫిక్ స్థితిని తెలుసుకుని, ఈజీగా మీ గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు.

  • ముందుగా గూగుల్ మ్యాప్స్ యాప్‌ ఓపెన్ చేయండి

  • తర్వాత మీ ప్రస్తుత స్థానం, గమ్యస్థానం నమోదు చేయండి

  • ఆ క్రమంలో గూగుల్ మ్యాప్స్ రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లను, ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తుంది

  • అప్పుడు మీ మార్గం మ్యాప్‌లో రంగు కోడెడ్ ట్రాఫిక్ సూచికలను చూడవచ్చు

  • మీ మార్గం రెడ్ కలర్లో ఉంటే, ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలి


ఇవి కూడా చదవండి:

Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..


8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 03:39 PM