Share News

Chennai: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ..

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:10 PM

అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ మహిళామోర్చా నాయకురాళ్లు ఆందోళనలు జరిపేందుకు డీఎంకే ద్రావిడ తరహా ప్రభుత్వం అనుమతివ్వడం లేదని, ఈ పరిస్థితులను చూస్తే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్లు అవగతమవుతోందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Dr. Tamilisai Soundararajan) ఆరోపించారు.

Chennai: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ..

- అన్నావర్శిటీలో అత్యాచారంపై సీబీఐ విచారణ

- గవర్నర్‌కు మహిళా మోర్చా వినతి

చెన్నై: అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ మహిళామోర్చా నాయకురాళ్లు ఆందోళనలు జరిపేందుకు డీఎంకే ద్రావిడ తరహా ప్రభుత్వం అనుమతివ్వడం లేదని, ఈ పరిస్థితులను చూస్తే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్లు అవగతమవుతోందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Dr. Tamilisai Soundararajan) ఆరోపించారు.

ఈ వార్తను కూడా చదవండి: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..


శనివారం సా యంత్రం మహిళామోర్చా నాయకురాలు ఉమారవి, ఆ పార్టీ జాతీయ కార్యాచరణ మండలి సభ్యురాలు ఖుష్బూ, సినీ నటి రాధిక(Khushboo, film actress Radhika), మాజీ ఎమ్మెల్యే విజయతరణి గిండిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.


nani1,2.jpg

ఆ సార్‌... ఎవరో వెల్లడించండి: ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ వెలుపల తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. అన్నావర్శిటీ ఉదంతంపై తాము వెలువరించిన అనుమానాలను గవర్నర్‌ ఓపిగ్గా విన్నారని చెప్పారు. ఆ విశ్వవిద్యాలయంలో సీసీ కెమెరాలు(CCTV cameras) పనిచేయకపోడం, బాధితురాలికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించకపోవడం వంటి విషయాలపై గవర్నర్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ఎవరితోనో మాట్లాడుతూ ‘సార్‌.. సార్‌’ అని పిలిచారని, ఆ సార్‌ ఎవరో వెల్లడించాలన్నదే తమ డిమాండ్‌ అని చెప్పారు.


ఈఉదంతంపై సీఎం స్టాలిన్‌, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మౌనంపాటించడం గర్హనీయమన్నారు. మిత్రపక్షాలకు చెందిన వైగో, తిరుమావళవన్‌ వంటి నాయకులకు ఆందోళనలు జరిపేందుకు అనుమతులిచ్చిన డీఎంకే ప్రభుత్వం అత్యాచారం బాధితురాలికి మద్దతుగా మహిళా మోర్చా విభాగం జరుపతలపెట్టిన ఆందోళనలకు అనుమతి ఇవ్వకపోవడం చూస్తే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెనీ ఉందని రుజువవుతోందన్నారు. అత్యాచార నేరస్థులకు ప్రభుత్వం అండగా ఉండటం వల్లే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు.


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 01:10 PM