Union Calender 2025: యూనియన్ క్యాలెండర్-2025ను విడుదల చేసిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Jan 07 , 2025 | 09:51 PM
'ప్రజా భాగస్వామ్యం ద్వారా ప్రజా సంక్షేమం' అనే శీర్షికతో విడుదల చేసిన ఈ క్యాలెండర్ గత దశాబ్దంలో వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని హైలైట్ చేస్తూ రూపొందించారు.
న్యూఢిల్లీ: ''జన్భాగీదారి సే జన్‌కల్యాణ్'' అనే థీమ్‌తో 2025 ప్రభుత్వ క్యాలెండర్ (Union Calender 2025)ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwin Vaishnaw) మంగళవారంనాడిక్కడ విడుదల చేశారు. 'ప్రజా భాగస్వామ్యం ద్వారా ప్రజా సంక్షేమం' అనే శీర్షికతో విడుదల చేసిన ఈ క్యాలెండర్ గత దశాబ్దంలో వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని హైలైట్ చేస్తూ రూపొందించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రచార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనవర్ థీరేంద్ర ఓధా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ యోగేష్ భజ్వా పాల్గొన్నారు.
CEC Rajiv Kumar: రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు
వ్యవసాయం, మహిళా సాధికారత, యూత్ అండ్ కెపాసిటీ ఎడిషన్ ఇన్ ప్రోగ్రస్ ఆఫ్ ది నేషన్ వంటి వివిధ అంశాల్లో సాధించిన ప్రగతి ఈ క్యాలెండర్‌లో హైలైట్ చేశారు. ప్రభుత్వం సాధించిన విజయాలతో భారత ప్రభుత్వం క్యాలెండర్ వేసే సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతోందని, సమష్టిగా దేశం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని ఒక అధికార ప్రకటనలో పేర్కొన్నారు. 13 భాషల్లో ఈ క్యాలెండర్‌ను ప్రచురించారు.
Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!
Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం
Read Latest National News and Telugu News