Share News

Vijay: 2026 ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యనే పోటీ.. స్టాలిన్, మోదీపై విజయ్ నిప్పులు

ABN , Publish Date - Mar 28 , 2025 | 08:16 PM

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం'రహస్యం'గా డీఎంకేకు సహకరిస్తోందని విజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్‌ వైపు డీఎంకే ఉంటూ, కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందని అన్నారు. తమళనాడు పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.

Vijay: 2026 ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యనే పోటీ.. స్టాలిన్, మోదీపై విజయ్ నిప్పులు

చెన్నై: తమిళగ వెట్రి కళంగం (TVK) అధ్యక్షుడు విజయ్ నేరుగా డీఎంకే, బీజేపీపై విరుచుకుపడ్డారు. 2026 ఎన్నికల్లో పోటీ టీవీకే, డీఎంకే మధ్యనే ఉంటుందన్నారు. శుక్రవారంనాడు తిరువన్మయూర్‌లో టీవీకే తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. వక్ఫ్ సవరణను కేంద్ర ఉపసంహరిచుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానం, త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ, ద్విభాషా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ మరో తీర్మానం చేశారు. మొత్తం 17 తీర్మానాలను ఈ సమావేశంలో ఆమోదించారు.

Kunal Kamra: కునాల్ కామ్రాకు తాత్కాలిక బెయిల్


ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, రాజకీయాలంటే ఒక్క కుటుంబం మాత్రమే బతాకాలనుకోవడం కాదని, డీఎంకే తమ పార్టీ కార్యక్రమాలను, సమావేశాలను అడ్డుకుటుందోందని విమర్శించారు. అన్ని అడ్డంకులను అధిగమించి ఈరోజు తాము సమావేశమయ్యామని, ఎలాంటి అవాంతరాలు వచ్చినా పార్టీ కార్యకర్తలను కులుసుకుంటూ సమావేశాలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు. స్టాలిన్ పేరును తొలిసారి నేరుగా ప్రస్తావిస్తూ, పేరులో ధైర్యం ఉంటే చాలదని, పనుల్లో కూడా చూపించాలని అన్నారు. డీఎంకే ఫాసిస్ట్ పాలనకు ఏమాత్రం తీసిపోదని ఘాటు విమర్శలు చేశారు.


మోదీజీ..తమిళనాడుతో జాగ్రత్త

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం'రహస్యం'గా డీఎంకేకు సహకరిస్తోందని విజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్‌ వైపు డీఎంకే ఉంటూ, కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందని అన్నారు. తమళనాడు పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ''మీరు రాష్ట్ర జీఎస్‌టీ తీసుకుంటున్నారు కానీ తమిళనాడుకు నిధులివ్వడం లేదు. విద్యకు నిధులు ఇవ్వకుండా త్రిభాషా విధానాన్ని రుద్దుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో తమిళనాడు సీట్లు లాగేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఏ డైరెక్షన్‌లో తీసుకువెళ్లాలనుకుంటున్నారో మీ ప్లాన్స్ అన్నీ మాకు తెలుసు. మోదీజీ... మీరు ఒక దేశం ఒకే ఎన్నికలు తెస్తున్నారు. తమిళనాడును చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. తమిళనాడు ఎన్నింటినో తట్టుకుని నిలబడింది. ఆ విషయం మరిచిపోవద్దు. బి కేర్‌ఫుల్'' అని విజయ్ హెచ్చరించారు. పెరియార్ సామాజిక న్యాయం, కామరాజ్ నిజాయితీపాలన, అంబేడ్కర్ సమన్యాయం, సమానావకాశాలు, వేలు నచియార్ సోషల్ ఇన్‌క్ల్యూజివిటీ, మతసామరస్యం, నీటి వనరుల కోసం పోరాటం వంటి వాటిని తమ పార్టీ సిద్ధాంతాలుగా తీసుకున్నట్టు చెప్పారు.


మునుపెన్నడూ చూడని ఎన్నికలు చూస్తారు

వచే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై విజయ్ మాట్లాడుతూ, మునుపెన్నడూ చూడని ఎన్నికలను వచ్చే ఏడాది చూస్తారని అన్నారు. ఇవి కేవలం రెండు పార్టీల మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. టీవీకే, డీఎంకే మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. ''గాలిని, వర్షాన్ని, సూర్యుడిని, ప్రకృతిని ఎవరు ఆపగలరు?. ఇవన్నీ దేవుడు సృష్టించాడు. అలాగే, మా ప్రజల కోసం సాగే రాజకీయాలను ఎవరూ ఆపలేరు'' అని విజయ్ ఢంకా బజాయించారు.


ఇవి కూడా చదవండి..

Mamata Banerjee: భారత ఆర్థిక వృద్ధిపై మమత సంచలన వ్యాఖ్యలు.. అమమానకరమంటూ మండిపడిన బీజేపీ

Supreme Court: అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్.. జస్టిస్ వర్మపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

Bengaluru: మా చేతులు కట్టేశారు..

Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ

For National News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 08:17 PM