Share News

Cooking oil: ఈ నూనె వాడితే.. గుండెకు చాలా మంచిది

ABN , Publish Date - Feb 02 , 2025 | 06:56 PM

Cooking oil: ఈ ఐదు వంట నూనెలు వాడితే గుండె జబ్బులు రావు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మార్కెట్‌లో దొరికే కల్తీ నూనెల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల నూనె వాడకంలో జాగ్రత్తలు పాటిస్తేనే వ్యాధులు రాకుండా ఉంటాయి.

Cooking oil: ఈ నూనె వాడితే.. గుండెకు చాలా మంచిది

Cooking oil: శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో.. రెండు రకాల కొవ్వులు ఉన్నాయి. అవి.. ఆరోగ్యకర, అనారోగ్యకరమైన కొవ్వులు. వీటిలో చెడు కొవ్వులు.. శరీరానికి హాని చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో అధికంగా చేరి.. మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల కాలేయం, గుండెకు సంబంధించిన జబ్బులతోపాటు ఊబకాయం తదితర సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఒకవేళ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉందని తెలిస్తే.. ఈ కింది చిట్కాలు ఫాలో అయితే చాలు. వాటిని తగ్గించుకోవచ్చు. అవి ఏటంటే..


శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఐదు రకాల నూనెలు సహాయపడుతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్‌ తగ్గించడంలో సహాయపడే నూనెలతో మీ గుండెను ఆరోగ్యంగా పదిలంగా ఉంచుకోవచ్చు.

నువ్వుల నూనె: ఈ నూనెలో పొగ శాతం అధికంగా ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది. ప్రతి టేబుల్ స్పూన్‌లో 5 గ్రాముల కంటే ఎక్కువ మోనోశాచురేటెడ్ కొవ్వుతోపాటు 2 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఈ నువ్వుల నూనె.. కూరలు చేయడానికి లేకుంటే సలాడ్‌లో తయారీలో ఉపయోగించవచ్చు. కానీ నువ్వుల నూనెలో కొద్ది పాటి వగరు ఉంటుంది. దీని కారణంగా వంటల్లో వినియోగించడానికి పలువురు సందేహిస్తారు.

వేరుశెనగ నూనె: ఈ నూనెలో చాలా పోషకాలుంటాయి. మార్కెట్‌లో ఈ నూనె ధర అధికంగా ఉంటుంది. అలాగే ఈ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం స్వల్పంగా ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు క్యాన్సర్ వ్యాధిని నిరోధించడంలో సైతం సహాయ పడుతుంది.ఈ నూనె వినియోగంతో గుండె పనితీరును మెరుగు పరచుకోవచ్చు. నాడీ వ్యవస్థ మెరుగుపరచడానికి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి..రక్తపోటును తగ్గించటానికి.. చర్మాన్ని రక్షించడంలో వేరు శనగ నూనె కీలక పాత్ర పోషిస్తుంది.


ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లో కొలెస్ట్రాల్ ఉండదు. దీనిని ఎక్కువగా సలాడ్‌లు లేదా పాస్తా‌లో ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్‌లో ఒలియోకాంతల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌తోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ నూనె రక్తంలో కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ (LDL) ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్‌లో ఉండే గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది.

చియా సీడ్ ఆయిల్: ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఇది గుండె ఆరోగ్యకరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. చియా విత్తనాలు ఫైబర్, ప్రోటీన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. బంగారు రంగులో ఉండే నూనెను చియా అంటారు. ఇది తక్కువ ఫ్రైయింగ్, పాస్తా, సలాడ్‌ల తయారీలో వినియోగిస్తే మంచిది. ఇది తక్కువ రుచిని కలిగి ఉంటుంది. వీటిలో ఫైబర్ స్వల్పంగా ఉంటుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్‌తోపాటు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడంలో దోహదపడుతోంది.


అవోకాడో ఆయిల్: అవోకాడో నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ముఖ్యంగా ఒలేయిక్ యాసిడ్, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, రక్తపోటును తగ్గించడంతోపాటు గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. అవకాడో ఆయిల్ శరీరం సహజంగా తయారు చేయలేని లుటిన్ వంటి ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. కాబట్టి అవోకాడో ఆయిల్‌తో సహా కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే లుటిన్‌ని పొందవచ్చు.

Updated Date - Feb 02 , 2025 | 08:08 PM