Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం

ABN, Publish Date - Mar 24 , 2025 | 06:01 PM

అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌‌లో సోమవారం ఉదయం అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. సభాపతి ఆదేశంతో రెండు స్టాల్స్ ఏర్పాటుకు లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 1/15

అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌‌లో సోమవారం ఉదయం అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 2/15

సభాపతి ఆదేశంతో రెండు స్టాల్స్ ఏర్పాటుకు లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 3/15

లోక్‌సభ క్యాంటీన్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 4/15

లోక్‌సభలోని సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 5/15

సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు ఈ స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 6/15

ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఈ స్టాల్స్ ఏర్పాటు చేసింది.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 7/15

ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు, ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 8/15

అరకు కాఫీ ఉత్పత్తి మరింత పెరగాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 9/15

అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 10/15

జీసీసీ ద్వారా ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పిస్తామని రామ్మోహన్‌ నాయుడు వ్యాఖ్యానించారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 11/15

గిరిజనులు పండించే ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ తీసుకురావాలనేది ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పమని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఉద్ఘాటించారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 12/15

పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం కావడం గర్వకారణమని ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 13/15

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ నుంచి జీఐ ట్యాగ్ పొందిన ఈ ఆర్గానిక్ కాఫీ కేవలం ఒక పానీయమే మాత్రమే కాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 14/15

ఇది 1.5 లక్షల గిరిజన రైతుల శ్రమకు దక్కిన ఫలితమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఎన్నో ఏళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న గిరిజన రైతుల కృషి అని చెప్పారు. నేడు అరకు కాఫీని జాతీయ వేదికపై నిలిపిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

 Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం 15/15

అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ తీసుకురావాలనేది ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

Updated at - Mar 24 , 2025 | 06:13 PM