Viral News: 104 ఏళ్ల బామ్మ.. జైలుకు ఎందుకు వెళ్లిందంటే..?
ABN , Publish Date - Feb 16 , 2025 | 06:22 PM
Viral News: ఒకటి రెండు కాదు.. 104 ఏళ్ల వయస్సున్న బామ్మ. జైలుకు వెళ్లింది. ఈ న్యూస్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఎందుకు వెళ్లిందంటే.. అది కూడా ఆ వయస్సులో ఆమెకు జైలుకు వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అరవై, డబ్బై ఏళ్లు రాగానే.. ఎవరైనా ఏం చేస్తారు. దేవుడిని తలుచుకొంటారు. అలాంటి వయస్సులో బర్త్ డే వేడుకలు అంటే ఏం అంటారు. ఆ అంతా అయిపోయింది. ఇంకా దేనికి ఈ వేడుకలు అంటూ ఓ విధమైన వైరాగ్యంతో వారు మాట్లాడతారు. అదే 90, 100 ఏళ్లు వచ్చిన వారికి బర్త్ డే వేడుకలు నిర్వహిస్తామంటే.. అవేమి వద్దు అంటారు. కానీ 104 ఏళ్ల బామ్మగారు మాత్రం తన బర్త్ డే వేడుకలు ఘనం జరుపుకోవాలనుకొంది.
అది కూడా జైలులో జరుపుకోవాలని భావించింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెబితే.. వారు పోలీసులకు తెలియజేశారు. దాంతో ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. మీ బర్త్ డే వేడుకలు జైల్లోనే జరుపుకోవాలని ఎందుకు అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం విని వాళ్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తన జీవితంలో ఒక్కసారి కూడా తాను జైలును చూడలేదని వారికి తెలిపింది. దీంతో ఆశ్చర్య పోవడం పోలీసుల వంతు అయింది.
Also Read : పద్ధతి మార్చుకోని యూఎస్.. కాళ్లకు, చేతులకు బేడీలు
ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు జైలులోకి తీసుకు వెళ్లి.. అందులో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇంతకీ జైలులో జన్మదిన వేడుకలు జరిపించుకొన్న ఈ బామ్మగారి పేరు లోరెట్టా. అమెరికా, మిచిగాన్ రాష్ట్రం లివింగ్‌స్టన్ కౌంటీలోని అవాన్ నర్సింగ్ హోమ్‌లో ఆమె నివసిస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీ ఆమె పుట్టిన రోజు. అయితే పుట్టిన రోజు అయిన రెండు రోజులకు అంటే.. ఫిబ్రవరి 8వ తేదీన జైల్లో పోలీసులు ఆమె జన్మదిన వేడుకలు నిర్వహించారు.
Also Read: ఇద్దరు పిల్లలున్న తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. తర్వాత తల పట్టుకున్నాడు.. ఎందుకంటే..?
కానీ నేరం చేసిన వాళ్లు మాత్రమే జైలుకు వెళ్లతారు. అదికూడా చేతులకు బేడీలు వేసి.. పోలీసులు సమక్షంలో వారిని తీసుకొని వెళ్లతారు. కానీ లోరెట్టా మాత్రం దర్జాగా జైల్లోకి వెళ్లింది. అది కూడా పోలీసులను వెంట బెట్టుకొని జైలుకు వెళ్లింది. అక్కడ జన్మదిన వేడుకులు జరుపుకొని.. తన మనస్సు్లోని కొరికను తీర్చుకొంది. అయితే లోరెట్టా పుట్టిన రోజు ఫొటోలను పోలీస్ ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి వైరల్‌గా మారాయి.
Also Read : సీఎం రేవంత్‌కి బీజేపీ ఎంపీ సవాల్
అంతేకాదు.. లోరెట్టా జన్మదిన వేడుకలు జైల్లో ఘనంగా జరిగాయని వివరించారు. జైల్లో ఆమె అద్భుతమైన సమయం గడిపిందని చెప్పారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరికను తీర్చినందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామంటూ పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోలీసులే కాదు.. లోరెట్టా సైతం తనదైన శైలిలో స్పందించడం గమనార్హం.
For Viral news And Telugu News