Nuclear Boy FBI: 12 ఏళ్లకే ఇంట్లో న్యూ క్లియర్ రియాక్టర్ కట్టాడు.. తర్వాత FBI ఏజెంట్లు వచ్చి..
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:35 PM
Nuclear Boy FBI: టీనేజ్ కూడా దాటని ఓ అమెరికన్ కుర్రాడు తన ఇంట్లోనే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే FBI ఏజెంట్లు ఆ కుర్రాడి ఇంటికి వెళ్లి..

Boy Builds Nuclear Reactor at Home: న్యూ క్లియర్ రియాక్టర్ నిర్మించాలంటే ఎంతో అనుభవం ఉండాలి. ఎంతో మంది మేధావులు శ్రమిస్తే కానీ ఈ పని పూర్తిచేయలేరు. అమెరికాలోని మెంఫిస్‌కు చెందిన 12 ఏళ్ల జాక్సన్ ఓస్వాల్ట్‌కి మాత్రం ఇది చిటికెలో పని. అందుకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు శాస్త్రవేత్తగా నిలిచి గిన్నిస్ రికార్డు కొల్లగొట్టాడీ వండర్ బాయ్. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను రూపొందించిన టేలర్ విల్సన్ పేరు మీద ఉండేది. అతడు 2008లో 14 సంవత్సరాల వయసులో ఈ రికార్డు సృష్టించాడు.
ఇంట్లోకి FBI ఏజెంట్లు వచ్చి..
అమెరికాలోని టెనెస్సీ రాష్ట్రంలో ఉన్న మెంఫిస్ జాక్సన్ స్వస్థలం. ఇతడికి చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల ఆసక్తి. తనను తాను నిరూపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ఒక రోజున ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి దాదాపు రూ.7 లక్షల విలువైన విడిభాగాలను కొనుగోలు చేసి తన బెడ్రూంలో న్యూక్లియర్ రియాక్టర్ రూపొందించాడు జాక్సన్. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెల్లడించడంతో ఈ వార్త సెన్సేషన్‌గా మారింది. తర్వాత ఒక రోజున జాక్సన్ తన బెడ్రూంలో నిద్రపోతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తట్టి లేపారు. వారెవరో కాదు FBI నిఘా ఏజెంట్లు. అచ్చం యంగ్ షెల్డన్ సిరీస్‌లో జరిగినట్టే. అందులో 10 ఏళ్ల షెల్డన్ చేసినట్టుగానే జాక్సన్ కూడా తనింట్లో న్యూక్లియర్ రియాక్టర్ నిర్మించి కల్పిత కథను నిజం చేశాడు. కాకపోతే ఇక్కడ మందలించడానికి బదులుగా జాక్సన్ ఇంట్లో అంతా బాగానే ఉందో లేదో తనిఖీ చేయడానికి FBI ఏజెంట్లు వచ్చారు. ఫ్యూజన్ వల్ల రేడియేషన్ లాంటి సమస్యలేవీ లేవని నిర్ధారించుకున్నాక.. జాక్సన్ తెలివితేటలను ప్రత్యేకంగా అభినందించి మరీ వెళ్లారు.
ఎలా చేశాడు..
న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా తయారుచేయాలో నేర్చుకున్న తర్వాత 'డెమో ఫ్యూజర్'ను నిర్మించాడు జాక్సన్. ఇందుకు తనకి సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టింది. రేడియేషన్, సూర్య కిరణాలను మించిన హై వోల్టేజ్ కరెంటు ప్రమాదాలను అధిగమించి మరీ ఈ ప్రాజెక్టు పూర్తిచేశాడు. ప్రపంచంలో అతి చిన్నవయసులోనే ఈ ఘనత సాధించిన కుర్రాడిగా నిలిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.
న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అంటే ఏమిటి?
రెండు తేలికపాటి అణువులు (హైడ్రోజన్ వంటివి) ఒకదానితో ఒకటి ఢీకొని బరువైన అణువును ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను అణు సంలీనం అంటారు. ఈ ఘర్షణలో చాలా శక్తి విడుదల అవుతుంది. ఇది సూర్యుడు,నక్షత్రాలలో జరిగే ప్రక్రియ. అందుకే సూర్యుడు పగలు, రాత్రి చాలా కాంతిని, వేడిని ఇస్తాడు.ఈ ప్రక్రియలో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఉపయోగిస్తారు. ఈ రియాక్టర్ రెండు కాంతి అణువులను కలిపి వాటిని అత్యంత వేడి చేసి వేగవంతం చేస్తుంది. ఇది జరిగినప్పుడు బరువైన అణువు ఏర్పడుతుంది. ఇది అపరిమిత వేడిని, శక్తిని విడుదల చేస్తుంది.
Read Also: Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
Window XP Wallpaper: ప్రపంచంలో బాగా పాప్యులర్ అయిన ఈ విండోస్ వాల్‌పేపర్ చరిత్ర గురించి తెలిస్తే..