Share News

Viral Video: వామ్మో.. ఇదేం పని అంకుల్.. ఇలాగేనా చేసేది..!

ABN , Publish Date - Feb 22 , 2025 | 11:10 AM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను ఆకట్టుకుంటాయి. కొన్ని వీడియోలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంటుంది. వాటిని మన ఫ్రెండ్స్‌తో ..

Viral Video: వామ్మో.. ఇదేం పని అంకుల్.. ఇలాగేనా చేసేది..!
Viral Video

Viral News: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను ఆకట్టుకుంటాయి. కొన్ని వీడియోలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంటుంది. వాటిని మన ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకుంటాం. అలాంటి వీడియో గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అంకుల్, ఓ కుర్రాడికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అయితే, ఇందులో తప్పెవరిది.. అసలు ఈ వాదనకు కారణమేంటి.. నడిరోడ్డుపై అంకుల్ కారు.. అబ్బాయి బైక్ ఆపి వాదులోవడానికి రీజన్ ఏంటి.. ఇంట్రస్టింగ్ మ్యాటర్ మీకోసం..


చాలా మందికి టూ వీలర్, ఫోర్ వీలర్ డ్రైవింగ్ వచ్చే ఉంటుంది. కొందరికి సొంత కారు లేకపోయినప్పటికీ.. ఏదోరకంగా డ్రైవింగ్ నేర్చుకొని ఉంటారు. అయితే, డ్రైవింగ్ వచ్చిన వారు.. తమ వాహనాలను రోడ్డుపై నడపాలంటే లైసెన్స్ తప్పనిసరి. మరి ఈ డ్రైవింగ్ లైసెన్స్ అప్రూవ్ కావాలంటే.. సదరు వ్యక్తికి ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలి. ఆ ట్రాఫిక్ రూల్స్‌పై పరీక్ష కూడా ఉంటుంది. అది పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు ఆర్టీవో అధికారులు. ఒకవేళ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే.. పోలీసులు ఫైన్ వేయడం, వెహికిల్‌ను సీజ్ చేయడం లాంటివి చేస్తారు. వాస్తవాలు చూస్తే.. డ్రైవింగ్ వచ్చిన వారికి ఏ కొద్ది మందికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండవు. కొందరికి తెలిసినా పట్టించుకోరు. నిర్లక్ష్యంగా, యధేచ్ఛగా తమ వాహనాలను తోలేస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో దీనికి నిదర్శనమైన ఘటనే చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పెద్ద మనిషికి.. యువకుడు ఎలాంటి గుణపాఠం నేర్పాడో వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.


ఇంతకీ ఏం జరిగింది..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బైకర్.. తన దారిలో తాను వెళ్తున్నాడు. ఇంతలో ఎదురుగా.. ఓ కారు మరో కారును ఓవర్ టేక్ చేసుకుంటూ వచ్చింది. వాస్తవానికి ఆ కారు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌టేక్ చేసింది. అసలే సింగిల్ వే.. ఆపై డు నాట్ క్రాసింగ్ లైన్‌ను దాటి వచ్చి మరీ ఓవర్ టేక్ చేసింది కారు. దీంతో బైకర్.. సదరు కారుకు షాక్ ఇచ్చాడు. కారుకు ఎదురుగా తన బైక్‌ను నిలిపేశాడు. తాను సైడ్ తప్పుకోనని.. రాంగ్ రూట్‌లో వచ్చిన నువ్వే తప్పుకోవాలంటూ కారు డ్రైవర్‌కు సూచించాడు. దీంతో కారులోంచి ఓ వ్యక్తి(మధ్య వయస్కుడు) వచ్చి.. బైకర్‌పై చిందులేశాడు. మిగతా వాహనాలు పక్క నుంచి వెళ్తుండగా.. నువ్వెందుకు నా కారుకు ఎదురుగా నిలిపావు అంటూ బైకర్‌పై చిర్రుబుర్రులాడాడు. దీనికి బైకర్ కూడా చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ‘మీరు నా దారికి అడ్డు వచ్చారు. ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా లైన్ క్రాస్ చేసి వచ్చారు. నేను పక్కకు తప్పుకోను. మీరే పక్క నుంచి వెళ్లిపోండి’ అంటూ కారు నడిపే వ్యక్తికి సూచించాడు. ఇలా ఇద్దరి మధ్య కాసెపు సంవాదం జరిగింది. రోడ్డుపై వచ్చి పోయే వాహనదారులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. బైకర్ ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో.. కారు నడిపే అంకులే తన కారును సైడ్‌కి తీసుకుని వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Updated Date - Feb 22 , 2025 | 11:10 AM